English | Telugu

మీరు అసలు మనుషులేనా.. అన్నం తింటున్నారా లేక! 

ఒక సినిమాని(Cinema)ప్రేక్షకులకి నచ్చేలా తెరకెక్కించడానికి, దర్శకుడుతో సహా కొన్ని వందల మంది రేయింబవళ్ళు కష్టపడతారు. నిర్మాత కూడా సినిమాపై ఫ్యాషన్ తో వందల కోట్లు ఖర్చు చేస్తాడు. అలాంటి సినిమాకి ఎలాంటి కల్మషం ఉండదు. తనకి తెలిసిందల్లా ప్రేక్షకులని ఎంటర్ టైన్ చెయ్యడమే. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎంతో మందికి జీవనోపాధి కల్పించడంలో కూడా ముందుంటుంది. ఒక ఫ్యామిలీ ఇంటి నుంచి థియేటర్ కి బయలు దేరిందంటే ఎంతమందికి ఆర్ధికంగా ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.

కానీ పైరసీ ఉగ్రవాదులు సినిమాని చంపేయడంతో పాటు ఎంతో మంది జీవనోపాధికి నష్టం చేకూరుస్తున్నారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఓజి' పైరసీ ఆన్ లైన్ లో ఉంది. హైదరాబాద్ తో పాటు ఇండియా వ్యాప్తంగా చాలా మంది పైరసీ లో 'ఓజి' ని చూస్తున్నారు. దీంతో కలెక్షన్స్ పరంగా 'ఓజి'(og)కి నష్టం చేకూరే అవకాశం ఉంది. ప్రేక్షకులు థియేటర్ కి రాకుండా ఉంటే, నిర్మాత మళ్ళీ సినిమా చెయ్యడానికి ఆలోచనలో పడతాడు. ఒక వేళ చెయ్యకపోతే సినిమాపై ఆధారపడి జీవనాన్ని కొనసాగించే వాళ్ళకి నష్టం. ఇలా పైరసీ వల్ల సినిమానే కాదు, ఎంతో మంది నష్టపోతారు. ఈ విషయంపై ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'పైరసీ(Piracy)చేసే వాళ్ళు అసలు మనుషులే కాదు. కడుపుకి అశుద్ధం తింటున్నారు. పైరసీ ని ప్రతి ఒక్కరు అరికట్టాలనే కామెంట్స్ చేస్తున్నారు.

ఇక 'ఓజి 'ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో తొలి రోజు వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో 155 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీకెండ్ తో పాటు 'దసరా' కలిసి రావడంతో మరిన్ని భారీ కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.