English | Telugu

ఓజి ఎప్పుడు రిలీజ్ అయ్యింది!.. ఈ డైరెక్టర్ కి దండ వేసి అభినందించాల్సిందే

'ఓజి'(OG)ని దర్శకుడు 'సుజీత్'(Sujeeth)తెరకెక్కించిన తీరుకి ప్రతి ఒక్కరు ఎంతో ముగ్దులవుతున్నారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై సైలిస్ట్ గా సీన్స్ ని చిత్రీకరించిన తొలి దర్శకుడు సుజీత్ అనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల డిజైన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయనే కితాబు ని కూడా అందుకుంటున్నాడు. ఈ మూవీలో ప్రభాస్, సుజీత్ కాంబోలో వచ్చిన 'సాహూ డైలాగ్ తో ఓజి లో సాహూని కనెక్ట్ చెయ్యడం జరిగింది. దీంతో అందుకు సంబంధించిన యూనివర్స్ లో ప్రభాస్(Prabhas)చేస్తాడనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.


సుజీత్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఓజి తో పవన్ కళ్యాణ్ సార్ తో అనుబంధం ఏర్పడింది. ప్రభాస్ నాకు అన్న లాంటి వ్యక్తి. ఓ జి యూనివర్స్ గురించి ఇప్పుడేమి ఆలోచించడం లేదు. యూనివర్స్ లో పవన్ గారు, ప్రభాస్ అన్న చెయ్యడం గురించి తర్వాత ఆలోచిస్తాను. ప్రీమియర్స్ సందడితో 'ఓజి' ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా తెలియడం లేదని . చెప్పుకొచ్చాడు. శర్వానంద్ హీరోగా వచ్చిన 'రన్ రాజారన్' తో సుజీత్ దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే.

వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ నుంచే ఓజి కి పాజిటివ్ టాక్ వస్తుంది. దీంతో తొలి రోజుకి సంబంధించి రికార్డు కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.



కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.