English | Telugu

వాగ్దేవికి పెద్దబాలశిక్షను బహుమతిగా ఇచ్చిన బాలయ్య

నందమూరి బాలయ్యకు చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి చెప్పక్కర్లేదు. టీవీ షోస్ లో కనిపిస్తూ అందరిని తనదైన మార్క్ కామెడీతో, అన్ స్టాపబుల్ డైలాగ్స్ తో అలరిస్తున్నారు. ఐతే  తెలుగు ఇండియన్ ఐడల్ షోలో కంటెస్టెంట్ వాగ్దేవి బాలయ్యని ఒక పొడుపు కథ పొడుస్తాను ఆన్సర్ చెప్పమని అడుగుతుంది. " చూస్తే చూస్తుంది కళ్ళు లేవు, నవ్వితే నవ్వుతుంది పళ్ళు లేవు, తంతే తంతుంది కాళ్ళు లేవు " అని అడిగేసరికి ఇది నీకంటే చిన్నగా ఉన్నప్పుడే నేను నేర్చుకున్నా అది  అద్దం అని చెప్తారు బాలయ్య. ఇంత ఫాస్ట్ గా ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు సర్ అని వాగ్దేవి అనేసరికి బాలయ్యానా , మాజాకానా అంటూ ఆట పట్టిస్తారు. రివర్స్ లో బాలయ్య వాగ్దేవికి ఒక పొడుపు కథ వేస్తారు. "ఐదుగురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు " ఎవరు అని అడిగేసరికి ఆన్సర్ చెప్పలేకపోతుంది వాగ్దేవి.