'ది కశ్మీర్ ఫైల్స్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడంటే...
గత కొన్ని వారాల్లో రాధే శ్యామ్, కిన్నెరసాని, పెళ్లి సందడి, కేజిఎఫ్: చాప్టర్ 2 వంటి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ తో వినోదాన్ని పంచిన 'జీ తెలుగు', ఈ సారి 'ది కశ్మీర్ ఫైల్స్' అనే మరో పాన్-ఇండియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రబోర్తి, పల్లవి జోషి, పునీత్ ఇస్సర్, దర్శన్ జోషి, మ్రిణాల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఆగష్టు 28న (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది...