English | Telugu

పార్వతి పరమేశ్వరులుగా డాక్టర్ బాబు, వంటలక్క

స్మాల్ స్క్రీన్ పై కార్తీక దీపం క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. డాక్టర్ బాబు, వంటలక్క వీళ్ళిద్దరూ ఈ సీరియల్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. ఇప్పుడు కార్తీక దీపం యాక్టర్స్ ని పెట్టి ఈవెంట్స్ చేయించాలని డిసైడ్ ఐనట్టుంది స్టార్ మా. అందుకే ఈ సారి వినాయక చవితి స్పెషల్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ ఈవెంట్‌లో డాక్టర్ బాబు శివుడిలా.. వంటలక్క పార్వతీ దేవిలా నటించింది. వినాయకుడి చరిత్రను ఆడియన్స్ కి చెప్పడానికి ఈ ఈవెంట్ నిర్వహించారు. మాతో పండగే పండగ టైటిల్ తో ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రోమో చూస్తేనే అదిరిపోయింది. గూస్ బంప్స్ వచ్చేసాయి. ప్రోగ్రాం కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇందులో శివుడి గెటప్‌లో నిరుపమ్ పరిటాల అద్భుతంగా అనిపిస్తే.. పార్వతీ దేవిగా ప్రేమీ విశ్వనాథ్.. నిజంగా దివి నుండి భువికి ఆ దేవతే దిగి వచ్చిందా అన్నట్టుగా మెస్మరైజ్ చేసేసింది. మరి ఈ ఈవెంట్ ఎప్పుడు, ఎన్ని గంటలకు, ఈ గణనాథుడి చరితంతో పాటు ఇంకా ఏ ఏ కార్యక్రమాలున్నాయి, ఎవరెవరు పాల్గొనబోతోన్నారనే విషయాలను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఇటు వైపు ఈటీవీ కూడా వినాయకచవితి స్పెషల్ ఈవెంట్‌ తో రెడీ అయ్యింది. కానీ ఎన్ని స్పెషల్ ఈవెంట్స్ వచ్చినా డాక్టర్ బాబు, వంటలక్క ముందు ఏదీ నిలబడలేదు అనేది వాస్తవం.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.