English | Telugu

మనవళ్లకు టీకాలు వేయించాల్సిన వయసులో టాటూలు అవసరమా?

వినాయక చవితి సందర్భంగా జబర్దస్త్, ఢీ 14 టీం మెంబర్స్ అంతా కలసి మన వూరి దేవుడు అనే స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు.ఇందులో హైపర్ ఆది, ఇమ్మాన్యూల్, వర్ష, ఇంద్రజ, ఖుష్బూ, ప్రగతితో పాటు మూవీ యాక్టర్స్ కృష్ణ భగవాన్, నాగినీడు కూడా పార్టిసిపేట్ చేసేసారు. ఇక ఇప్పుడు తాజాగా విడుదలైన ఈ ఈవెంట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గణేష్ ఉత్సవాల్లో భాగంగా జబర్దస్త్ టీం మెంబర్స్ అంతా కలిసి బురదలో కబడ్డీ ఆడతారు. నాటీ నరేష్. ఇమ్ము ముఖం మీద బురద కొట్టడం భలే ఫన్నీగా ఉంది. ఇక నటి ప్రగతి ఆకుపచ్చని లంగా ఓణీలో రాను రానంటూనే చిన్నదో అనే పాటకు చేసిన డాన్స్ పెర్ఫామెన్స్ అదిరిపోయింది. ఇంద్రజ కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తుంది. ప్రగతి, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, ఇంద్రజ కలిసి సరదాగా ఓ స్కిట్ ప్లే చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేసారు. ఈ స్కిట్ లో హైపర్ ఆది ప్రగతి మనవడిగా నటించి ఫుల్ ఫన్ క్రియేట్ చేసాడు.

ప్రగతి స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి కండలు చూపిస్తూ ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని ఆది "నాయనమ్మా మనవళ్లకు టీకాలు వేయించాల్సిన వయసులో ఈ టాటూలు ఏంటి చూసుకోవాలి కదా" అని సెటైర్ వేస్తాడు. ప్రగతి కూడా ఈ డైలాగ్ కి కాస్త ఫీల్ ఐనట్టే కనిపించింది. పిల్లల్ని పెంచాల్సిన వయసులో కండలు పెంచుతోంది అని చెప్పడంతో స్టేజి మీద నవ్వులు విరిశాయి. తర్వాత అవుట్ డోర్ లో హైపర్ ఆది, ఇమ్మాన్యూల్, వర్ష చేసిన స్టంట్స్ తో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించారు. వర్ష ప్రేమ కోసం ఇమ్మాన్యూల్ తన చేతులపై కార్లు ఎక్కించుకుంటాడు. ప్రేమ కోసం నువ్వు కూడా కార్లు ఎక్కించుకో అని వర్షని కూడా బలవంత పెట్టేసరికి వర్ష కూడా చేతులపై కార్లు ఎఎక్కించుకుంటుంది. దీంతో ఇండోర్ లో ఉన్నవాళ్లు ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత వర్ష, ఇమ్ము, ఆది ట్యూబ్ లైట్స్ తో అద్దిరిపోయే స్టంట్ చేశారు. ట్యూబ్ లైట్స్ ని బాడీ మీదా పగలగొట్టుకోవాలి అని ఆది చెప్పేసరికి ఇది రిస్క్ , వద్దు అని వర్ష చెప్తుంది. చాలా ఈజీ అంటూ ఒక ట్యూబ్ లైట్ ని ఇమ్ము వీపుపై పగలగొడతాడు. అంతే ఒక్కసారిగా ఇమ్ము అరుస్తూ కింద పడిపోతాడు. దీనితో మా ఇమ్మూనే కొడతావా అంటూ ఆది వీపు పగలగొడుతుంది వర్ష . వెంటనే ఆది కూడా వర్ష వీపుపై ట్యూబ్ లైట్ పగలగొడతాడు. అంతే వర్ష ఏడుస్తూ కిందపడిపోతుంది. ఇలా ఈ ఈవెంట్ లో ఎన్నో ఎలిమెంట్స్ మనల్ని అలరించడానికి ఈ నెల 31 న ఉదయం 9 గంటలకు ప్రసారం కాబోతోంది.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.