English | Telugu
నా ప్రేమను చాపలా పరిస్తే.. పవిత్రను ఎత్తుకున్న నవీన్ చంద్ర!
Updated : Aug 22, 2022
సండే వచ్చిందంటే చాలు కొత్త కొత్త షోస్ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉన్నాయి. అలానే శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ సందడి ఎపిసోడ్ బాగా అలరించింది. ఈ షోకి యాక్టర్ నవీన్ చంద్ర గెస్ట్ గా స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. అతడిని చూసి జబర్దస్త్ కమెడియన్ పవిత్ర లేచి "ఐ ఫెల్ట్ సిగ్గు బావ" అనేసరికి నవీన్ కూడా సిగ్గు పడిపోయాడు. ఆ తర్వాత బావా నాకోసం ఒక డైలాగ్ చెప్పవా అనేసరికి, వెంటనే నవీన్ చంద్ర "షి ఈజ్ బ్యూటిఫుల్" అంటూ పవిత్రను రెండు చేతుల్లో ఎత్తుకున్నాడు.
తర్వాత "ఒక హీరోయిన్ కి ఒక హీరో డైలాగ్ ఎలా చెప్తాడు, నేను మీ హీరోయిన్ అనుకుని చెప్పండి" అంది పవిత్ర.తర్వాత "నా ప్రేమను చాపలా పరిస్తే" అంటూ 'అందాల రాక్షసి' మూవీ డైలాగ్ చెప్పాడు నవీన్. వెంటనే నూకరాజు వచ్చి "లేడీస్ అడగగానే డైలాగ్ చెప్పేశారు, మా మగాళ్ల కోసం ఒక డైలాగ్ చెప్పండి" అన్నాడు. వెంటనే "వీడు మా నాన్నను చంపాడు" అనే డైలాగ్ మాంఛి సీరియస్ గా చెప్పేసరికి నూకరాజు ఒక్కసారిగా షాక్ ఐపోయి నోరెళ్లబెట్టేశాడు. డైలాగ్ చెప్పేసాక నవీన్ నవ్వేశాడు. అప్పుడు నూకరాజు షాక్ లోంచి బయటికొచ్చాడు. "నూకరాజుకి డైపర్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే.." అని ఫన్ చేసాడు రవి. తర్వాత నవీన్ చంద్ర, సిరి హన్మంత్ కలిసి డాన్స్ చేశారు.