English | Telugu
పంచులు వేయడానికి కానీ పరోటాలు చేయడానికి వస్తారా షోకి
Updated : Aug 22, 2022
అన్నపూర్ణమ్మ ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి నటి. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద కూడా తన హవా కొనసాగిస్తోంది. ఇటీవల వస్తున్న అన్ని షోస్ లో కూడా అన్నపూర్ణమ్మ కనిపిస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. అలాగే జబర్దస్త్ లో స్కిట్స్ వేస్తోంది. ఇక ఇప్పుడు పెద్దమ్మగా శ్రావణ సందడి షోలో ఎంటర్టైన్ చేసేసింది. అనసూయ పెద్దమ్మ అంటూ అన్నపూర్ణమ్మను పిలిచేసరికి పెద్దమ్మ అంటే అరుంధతిని పిలిచినట్టుగా ఉంది అబ్బాయి నాకు అని అంటుంది రవితో. జేజెమ్మ అని కాదు పిలిచింది పెద్దమ్మ అని అనేసరికి సీరియస్ గా చూస్తుంది. పెద్దమ్మ అంటే మీరేనా అంటూ మూతి విరుస్తాడు రవి.
నేను గాక చందమామలోంచి పేదరాశి పెద్దమ్మ దిగొస్తుంది అనుకున్నావా ఏమిటి అంటుంది అన్నపూర్ణ. అబ్బో ఇక్కడికొచ్చి పంచులేస్తున్నారుగా అంటాడు రవి. మరి పంచ్లు వేయకపోతే పరోటాలు చేస్తారా ఏమిటి అంటూ కౌంటర్ వేస్తుంది అన్నపూర్ణమ్మ. ఇక ఆమె కోపం తగ్గించడానికి నువ్వే రోజూ నా కలలోకి వస్తూ ఉంటావ్ అంటాడు రవి. అమ్మాయిలు గొప్పా అబ్బాయిలు గొప్పా అంటూ పోటీ పడేసరికి వాళ్ళ వాళ్ళ సమస్యలకు అన్నపూర్ణ ఆన్సర్స్ ఇస్తుంది. ఇంతలో రవి ఆడపిల్లల్ని ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలి పెద్దమ్మ అని అడిగేసరికి. కొషెన్స్ అడుగు అంతే కానీ సీక్రెట్స్ అడగకు అంటూ ఫన్ చేస్తుంది అన్నపూర్ణమ్మ.