English | Telugu

సింగర్ పార్వతి గురించి ఈ విషయం తెలుసా

సరిగమప సింగింగ్ షో రెండు రాష్ట్రాల ప్రజలని అలరించిన అద్భుతమైన షో. ఈ షోకి సంబంధించి సింగింగ్ సూపర్ స్టార్ అవార్డు ని సొంతం చేసుకుంది శృతిక సముద్రాల. ఇక గ్రాండ్ ఫినాలే వరకు చాలా మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో డేనియల్, పార్వతి కూడా ఉన్నారు. పార్వతి గురించి గూగుల్ లో టైపు చేస్తే ఊరుకి బస్సు వేయించిన అమ్మాయి అని కనిపిస్తుంది. ఎంతో కష్టపడి పైకొచ్చిన అమ్మాయి పార్వతి. కోటి గారికి పార్వతి అంటే ఎంతో అభిమానం కూడా. ఇక ఇలాంటి సింగర్ పార్వతి గురించి డేనియల్ ఇంటరెస్టింగ్ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

పార్వతి పైకి ఏమీ తెలియని అమాయకురాలిలా కనిపిస్తుంది కానీ మస్త్ పంచులు వేస్తది, పాటలు బాగా పాడతాది, కామెడీ కూడా చేస్తుంది. ఇవి కాకుండా ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్తానంటూ డేనియల్ ఇలా చెప్పుకొచ్చాడు. భూమి తల్లకిందులైనా, తుపానొచ్చినా ఏమొచ్చినా కూడా రాత్రి 9 గంటల లోపు భోజనం చేసేసి నిద్ర పోవడం అలవాటు..ఉదయాన్నే 4 .30 కల్లా నిద్ర లేవడం అలవాటు.

ఇక ఉదయాన్ని పాటలు ప్రాక్టీస్ చేస్తూ మమ్మల్ని టార్చర్ పెట్టేదని చెప్పుకొచ్చాడు డేనియల్. నిద్రపట్టకపోయేసరికి 7 గంటల నుంచి ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పాడట డేనియల్. అలా రెండో రోజు నుంచి ప్రాక్టీస్ టైమింగ్స్ మార్చుకుందని చెప్పాడు. పార్వతి అచ్చ తెలుగు అమ్మాయిలా కరెక్ట్ టైమింగ్స్ ఫాలో అవుతుంది అని చెప్పాడు. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు త్వరగా నిద్రపోయి త్వరగా లేవాలని అది మాత్రం కచ్చితంగా ఫాలో అవుతుంది పార్వతి అంటూ ఆమెను అభినందించారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.