English | Telugu
మోడీ నోట తెలంగాణ విమోచన దినం మాట!
Updated : Aug 31, 2025
ప్రధాని నరేంద్రమోడీ నోట తెలంగాణ విమోచన దినోత్సవం మాట వచ్చింది. తెలంగాణ హైదరాబాద్ నియంతృత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి చెందిన సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న రోజు అన్న సంగతి తెలిసిందే. అలాంటి తెలంగాణకు అత్యంత ప్రాముఖ్యత ఉన్న రోజు గురించి ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు.
మోడీ మన్ కీ బాత్ 125వ ఎపిసోడ్ లో ఆదివారం (ఆగస్టు 31)న తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ నిజాం నియంతృత్వ కబంధ హస్తాల నుంచీ, రజాకార్ల దురాగతాల నుంచి విముక్తి చెంది నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందిన రోజు సెప్టెంబర్ 17 అన్నారు. నిజాం పాలనలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినా, వందేమాతరం అని నినదించినా చంపేసేవారని పేర్కొన్న మోడీ.. సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోతో తెలంగాణను నిజాం కబంధ హస్తాలనుంచి విముక్తి చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాడు ఉక్కు మనిషి సర్దార్ పటేల్ రేడియోలో చేసిన ప్రసంగాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో వినిపించారు.