English | Telugu
బీజేపీయే రైట్ అని తేలింది.. కేంద్ర మంత్రి బండి
Updated : Sep 1, 2025
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై తాము చేస్తున్న పోరాటం నేటికి ఫలించిందనీ, కాళేశ్వరంపై బీజేపీ వైఖరే సరైనదని రుజువైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాల్సిందే అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించడాన్ని స్వాగతించిన బండి సంజయ్.. సోమవారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ తొలి నుంచీ సీబీఐ విచారణ కోరుతున్న సంగతిని గుర్తు చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సీబీఐకి లేఖ పంపాలని ఆయన రేవంత్ ను కోరారు.