English | Telugu

బిగ్ బాస్ నన్ను రూమ్‌కి పిలిచాడు అంటూ గోల చేసిన కావ్య!

బిగ్ బాస్ సీజన్-8 ముగింపుకి వచ్చేసింది. ఇక ఈ సీజన్ ముగియడానికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం హౌస్ లో అవినాష్ , నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ప్రభాకర్-ఆమని, అర్జున్ కళ్యాణ్-అనుమిత హౌస్ లోకి రాగా వారితో కలిసి హౌస్ మేట్స్ టాస్క్ లు ఆడారు. ప్రైజ్ మనీ పెరగవచ్చు, తగ్గవచ్చు అని , ట్విస్ట్ లు టర్న్ లు ఉంటాయని వీకెండ్ లో నాగార్జున చెప్పకనే చెప్పారు. ఇక నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది . ఇందులో బ్రహ్మముడి కావ్య బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది.

లేడీ లక్కు లేడీ లక్కు సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన కావ్య అలియాస్ దీపిక.. హౌస్‌మేట్స్ అందరితో తనదైన డ్యాన్స్ స్టెప్స్ తో అదరగొట్టేసింది. వెంటనే అందరిపై ఓ డైలాగ్ వేసేసింది. ఏంట్రా మీరందరూ బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చారా లేక వెయిట్ లాస్ థెరపి సెంటర్‌కి వచ్చారా అంటూ దీపిక అడగ్గానే హౌస్‌మేట్స్ తెగ నవ్వుకున్నారు. ఆ తర్వాత బేస్ వాయిస్‌తో కావ్య మీకు బిగ్‌బాస్ పరివారంలోకి స్వాగతమంటూ బిగ్‌బాస్ అనగానే.. అసలు మీ లైఫ్‌లో రొమాన్స్‌యే ఉండదా.. కావ్య నువ్వు బిగ్‌బాస్‌ హౌస్‌కి వచ్చావ్ కదా అంటూ ప్రేమగా పలకరించరా అంటూ దీపిక వాయించేసింది. ఇంతలో కావ్య కన్ఫెషన్ రూమ్‌కి రండి అంటూ బిగ్‌బాస్ అనగానే.. హేహే నన్ను బిగ్‌బాస్ రూమ్‌కి రమ్మని పిలిచారంటూ గెంతులేసింది దీపిక. ఆ తర్వాత ఒక అమ్మాయితో ఫ్యూచర్‌లో నీకు పెళ్లి అవుతుంది.. పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదు.. అప్పుడు ఏం చేస్తావ్.. తనని అక్కా అని పిలిచి వచ్చేస్తావా అంటూ గౌతమ్ ని దీపిక అడిగి తెగ నవ్వేసుకుంది. దీనికి గౌతమ్ నవ్వుతూ కవర్ చేశాడు. ఆ తర్వాత హౌస్ లో గేమ్స్ ఆడింది కావ్య. ఇక ప్రోమో చివరిలో కావ్య మీరుండే సమయం పూర్తయింది.. ఇక బయలుదేరండి అంటూ బిగ్‌బాస్ చెప్పగా.. ఎక్కడైనా గెస్టు వస్తే వాళ్లు పని ఉందని వెళ్లాలి.. ఇలా పిలచి పొమ్మాంటారా అంటూ డైలాగ్ వేసింది కావ్య. దీంతో వామ్మో అలా అనకూడదంటూ అవినాష్ తో పాటు హౌస్‌మేట్స్ అంతా దండం పెడుతూ సారీ బిగ్ బాస్ అని అన్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.