English | Telugu

21 న బిగ్ బాస్ సోనియా ఆకుల- యాష్ పెళ్లి

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆకుల సోనియా హౌస్ నుంచి వచ్చాక రీసెంట్ గ యష్ పాల్ వీరగోని అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇక తానూ చేసుకోబోయే శ్రీవారిని తీసుకెళ్లి హీరో నాగార్జునని కలిసి పెళ్లి శుభలేఖ అందించి పెళ్ళికి రావాలంటూ ఆహ్వానించింది. "మా జీవితంలో స్పెషల్ డే .. మా వివాహానికి రావాలని నాగార్జునగారిని ఆహ్వానించాం" అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. నవంబర్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా ఈ నెల 21 న పెళ్లి చేసుకోబోతున్నారంటూ చెప్పారు. ఇక సోనియా చేసుకోబోయే అబ్బాయి విషయానికి వస్తే .. యష్ పాల్ సొంతూరు వరంగల్. యష్ కష్టపడి చదువుకుని అమెరికా వెళ్లి చాలా ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశారు.

అమెరికాలో చదువు కోసం వెళ్లిన రోజుల్లో తనకి ఎదురైన ఇబ్బందులు మరొకరికి ఎదురు కాకూడదనే ఉద్దేశంతో 'ఫ్లయ్ హై' అని ఒక కన్సల్టెన్సీని స్థాపించారు. అలానే ఫ్లయ్ హై టూరిజం, విరాట్ ఫౌండేషన్ సంస్థలను నడుపుతున్నారు . ఈ వ్యవహారాలన్నింటినీ యష్ స్వయంగా చూసుకుంటున్నారు. ఇక యష్‌ ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా. అండర్ 16, అండర్ 19 మ్యాచులు ఆడారు. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సహా అనేకమంది స్టార్ క్రికెటర్లతో యష్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కపిల్ దేవ్ యాష్ బర్త్ డేకి స్పెషల్ విషెస్ చెప్తూ వీడియో కూడా పంపించారు. ఇక యష్‌కి సంబంధించిన ఒక సంస్థలో సోనియా గతంలో పని చేసేది. అయితే యష్‌కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. కానీ తన మొదటి భార్యకి విడాకులిచ్చి ఇప్పుడు సోనియాని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని సోనియానే స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేరణతో చెప్పింది. ఇక నెటిజన్స్ వీళ్ళ పెళ్ళికి విషెస్ చెప్తూ రిప్లైస్ ఇస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.