English | Telugu

చిన్నదాని కోసం పవన్ వస్తాడా?

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు టాలీవుడ్ హీరోల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. యంగ్ హీరో నితిన్ పవన్‌కు వీరాభిమాని అనే విషయం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నితిన్ తన సినిమాల్లో పవన్ సాంగో.. పేరో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక నితిన్ తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిన్నదాన నీకోసం క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం థియేటర్లో విడుదల కాకముందుగానే పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాను చూపించి ఆశీస్సులు తీసుకోవాలని నితిన్ అనుకుంటున్నాడట. అందుకోసం పవన్ కళ్యాణ్ కోసం ఓ స్పెషల్ షో వేయడానికి నితిన్ నిర్ణయించుకున్నాడు. మరి పవన్ వస్తాడో లేదో అనే విషయం త్వరలోనే తెలియనుంది.