English | Telugu

రెబెల్ స్టార్ నవ్విస్తాడట..!

గత రెండు సంవత్సరాలుగా బహుబలి షూటింగ్ లో బిజీగా గడుపుతున్న ప్రభాస్, తన అభిమానుల నిరాశను దూరం చేయడానికి బాహుబలి రెండో పార్టు మధ్యలో మరో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమా దర్శకుడు ఎవరోకాదు ‘రన్ రాజా రన్’ లాంటి హిట్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు సుజిత్. బాహుబలి తొలి పార్టు షూటింగ్ పూర్తయ్యే దశలో ఉండటంతో.. ఆ పని అవగానే మూడు నెలలు గ్యాప్ తీసుకుని సుజీత్ సినిమాలో నటిస్తాడట ప్రభాస్. ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ స‌బ్జెక్ట్ అట‌. సీన్ నెంబ‌ర్ 1 నుంచి ఎండ్ కార్డ్ వ‌ర‌కూ అన్నీ న‌వ్వులే న‌ట‌. కాన్సెప్ట్ కూడా కొత్త‌గా వ‌చ్చింద‌ట‌. యాక్ష‌న్ మూడ్ లోంచి బ‌య‌ట‌కు రావ‌డానికే ప్ర‌భాస్ ఈ స్ర్కిప్టు ఓకే చేశాడ‌ని తెలుస్తోంది. కాబట్టి వచ్చే ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకానే అన్నమాట.