English | Telugu

అత‌డి టార్గెట్ అల్ల‌రి న‌రేశ్!

టాలీవుడ్ లో హీరోల మ‌ధ్య కాంపిటిష‌న్ మామూలుగా లేదు. ముఖ్యంగా యూత్ హీరోల్లో ఈ పోటీ మ‌రీ ఎక్కువ‌. అయితే అల్ల‌రి న‌రేశ్ ను దీనికి మినహాయింపు అని చాలా మంది అంటుంటారు. కానీ ఇప్పుడు అల్ల‌రి న‌రేశ్ కు పోటీగా ఇప్పుడు కొత్త హీరో తెరపైకి దూసుకొచ్చాడు. అత‌ను మ‌రెవ‌రో కాదు హృద‌య కాలేయం ఫేం.. బ‌ర్నింగ్ స్టార్.. సంపూర్ణేశ్ బాబు..


సంపూర్ణేశ్ బాబు అల్ల‌రి న‌రేశ్ నే టార్గెట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే న‌రేశ్ రూటే స‌ప‌రేటు. అత‌నితో సినిమా చేస్తే ప్రొడ్యూస‌ర్లు గుండెమీద చెయ్యి వేసుకొని ప‌డుకోవ‌చ్చ‌ని చెబుతుంటారు. అందుకే అత‌నికి మినిమం గ్యారెంటీ హీరో అని పేరుంది. ఏ హీరో కూడా అత‌నికి పోటీ కాదు. ఎందుకంటే కామెడీ ఎవ‌ర్ గ్రీన్. రిస్కే ఉండ‌దు. అందుకే కామెడీకే కొంచెం స్టోరీ మిక్స్ చేసి న‌రేశ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మ‌ధ్య అత‌ని టైమ్ బాగా లేదు. సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప‌వుతున్నాయి. కామెడీలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో పాటు స్టోరీలో వీక్ నెస్ తో ప్రేక్ష‌కుల నుంచి అంత రెస్పాన్స్ రావ‌డం లేదు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో హృద‌య కాలేయం అంటూ దూసుకొచ్చాడు సంపూర్ణేశ్ బాబు. వ‌చ్చీరాగానే త‌న మార్కును చాటుకున్నాడు. త‌న బ్రాండును క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు అవ‌కాశాలు కూడా అత‌నికి బాగానే ఉన్నాయి. ఇప్పటికే మంచి విష్ణు మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. దీనికి తోడు రెండు మూడు సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. అన్నీ కామెడీ సినిమాలే. ఇందులో ఒక‌టి రెండు హిట్ట‌యినా సంపూర్ణేశ్ కు మంచి మైలేజ్ రావ‌డం ఖాయం. అల్ల‌రి న‌రేశ్ కు బ్యాడ్ టైమ్ న‌డుస్తున్న త‌రుణంలో.... సంపూర్ణేశ్ బాబు హిట్ సినిమాలిస్తే ఇండ‌స్ట్రీలో అత‌ని స్థానం సుస్థిరమైన‌ట్టేన‌ని అంటున్నాయి ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు.