English | Telugu

Karthika Deepam2 : పనిమనిషిని ప్రెగ్నెంట్ చేసిన గౌతమ్.. అతడిని జ్యోత్స్న పెళ్ళి చేసుకుంటుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -303 లో.....కార్తీక్ దగ్గరికి శ్రీధర్ వచ్చి.. మీ తాత, మీ అమ్మకి నీకు అన్యాయం చేసాడు. ఈ పేపర్ పై సంతకం పెట్టు కోర్ట్ కి ఈడుద్దామని శ్రీధర్ అంటాడు. అవసరం లేదని కార్తీక్ అంటాడు. వాళ్ళు ఆస్తులు ఇవ్వకపోయిన మాకు బంధువులే.. నీకు తాతపై ఉన్న కోపం ఇలా తీర్చుకోవాలనుకుంటున్నావు కానీ వద్దని కార్తీక్ అంటాడు. నువ్వు అయిన చెప్పు దీప అని దీపతో శ్రీధర్ అనగానే కార్తీక్ మాటే తన మాటఅన్నట్లు దీప చెప్తుంది.

దాంతో శ్రీధర్ కోపంగా.. మీరు వదిలేసినా, నేను వదలను.. మామ ఈ అల్లుడు అంటే చూపిస్తానని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు దాస్, స్వప్న, కాశీలు భోజనం చేస్తుంటారు. కాంచన అత్తయ్యకి అన్యాయం జరిగిందని కాశీ అంటాడు. కార్తీక్ అన్నయ్యకి జరిగింది.. ఇప్పుడు ఆస్తులకి అసలైన వారసురాలు జ్యోత్స్న అని స్వప్న అనగానే.. దాస్ కి గతం గుర్తు వచ్చి అసలైన వారసురాలు ఏంటి అది.. ఆపాలి అంటూ వెళ్ళబోతుంటే అప్పుడే ఏదో సౌండ్ వస్తుంది. దాంతో మళ్ళీ గతం మర్చిపోతాడు. కార్తీక్ అన్నయ్యకి అన్యాయం జరిగిందని అలా అన్నాడేమో అని స్వప్న, కాశీలు దాస్ మాట్లాడినదాన్ని గురించి మాట్లాడుకుంటారు.

ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి సుమిత్ర వచ్చి పెళ్లి చేసుకోమని అడుగగా.. వద్దని తను అంటుంది. అందరు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు.. పెళ్లి చేసుకుంటే ఆస్తులన్నీ నీ పేరున రాస్తా అని సుమిత్ర అనగానే జ్యోత్స్న సరే అంటుంది. గౌతమ్ చాలా మంచివాడు పైగా నీ ఫ్రెండ్ అని సుమిత్ర అంటుంది. సరే నేను వెళ్లి గౌతమ్ తో మాట్లాడి నిర్ణయం చెప్తాన జ్యోత్స్న అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు గౌతమ్ వాళ్ళింట్లో పనిమనిషితో లవ్ ట్రాక్ నడుపుతాడు. తాను ప్రెగ్నెంట్ అని అమ్మాయి పేరెంట్స్ గౌతమ్ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడే దీప గౌతమ్ ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొని వస్తుంది. అక్కడ ఏదో గొడవ జరుగుతుందని డౌట్ వచ్చి ఏమైందని అడుగుతుంది. నీకు అవసరం లేదని దీపపై గౌతమ్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.