English | Telugu
Brahmamudi : రౌడీకి కోటి రూపాయలు ఇచ్చిన యామిని.. వాళ్ళిద్దరు చూసేసారుగా!
Updated : Jun 19, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -751 లో.....రాజ్, యామినీల పెళ్లిలో భాగంగా మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. రాజ్ నువ్వు వచ్చి యామినికి మెహందీ పెట్టమని వైదేహి అంటుంది. దాంతో రాజ్ కాస్త ఇబ్బందిగానే యామిని పక్కన వచ్చి కూర్చుంటాడు. రాజ్ యామినికి మెహందీ పెట్టడం ఆపాలని అప్పు, కళ్యాణ్ ప్లాన్ చేసి కావ్యపై ఎటాక్ చేసిన రౌడీతో యామినికి ఫోన్ చేయిస్తారు.
ఆ రౌడీ యామినికి ఫోన్ చేసి ఇప్పుడు మీ ఇంటి ముందున్నాను.. మీరు ఇప్పుడు కనుక రాకుంటే మీరే కావ్యపై ఎటాక్ చేయించారని పోలీస్ స్టేషన్ లో చెప్తానని బ్లాక్ మెయిల్ చెయ్యగానే యామిని మెహందీ పెట్టించుకోకుండా రౌడీ దగ్గరికి వస్తుంది. మీరు నాకు ఇప్పుడు కోటి రూపాయలు ఇవ్వాలని రౌడీ డిమాండ్ చేస్తాడు. దానికి యామిని ఒప్పుకుంటుంది. అదంతా అప్పు, కళ్యాణ్ వీడియో తీస్తారు. అప్పుడే యామిని దగ్గరికి వైదేహి, రఘు నందన్ వచ్చి ఏంటి కోటి రూపాయలు అంటున్నారని అడుగుతాడు. ఆ తర్వాత చెప్తానని యామిని అంటుంది. ఆ తర్వాత యామిని తన పేరెంట్స్ కి అసలు విషయం చెప్తుంది. నాకు కోటి రూపాయలు కావాలని యామిని అడుగుతుంది. ఇలా ఇంకొకసారి చేస్తే సపోర్ట్ చెయ్యమని యామినికి వార్నింగ్ ఇస్తాడు రఘునందన్.
ఆ తర్వాత రాహుల్, రుద్రాణి కలిసి యామిని దగ్గరికి వస్తారు. ఆ కావ్య వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఎలాగైనా మీ పెళ్లి జరిగేలా చూస్తానని యామినితో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత సంగీత్ కి కావ్య రెడీ అయి వస్తుంది. స్వప్న వచ్చి ఏంటే నీ భర్తకి పెళ్లి జరుగుతుంది. నీకు బాధగా లేదా అంటూ మాట్లాడుతుంది. అప్పుడే రాజ్ పాట పాడుకుంటు కావ్య దగ్గరికి వస్తాడు. తరువాయి భాగం లో సంగీత్ టైమ్ కి యామినికి రౌడీ ఫోన్ చేస్తాడు. రాజ్ తో కావ్య డాన్స్ చేస్తుంది. రౌడీకి యామిని కోటి రూపాయలు ఇచ్చేది అప్పు, కళ్యాణ్ వీడియో తీస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.