English | Telugu
అష్షు కాళ్ళు పట్టుకున్న హరి..అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి భయపడుతున్నారు
Updated : Jun 18, 2025
కాకమ్మ కథలో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ న్యూ ఎపిసోడ్ కి హరి, అష్షు రెడ్డి వచ్చారు. ఇక ఈ షోలో వీళ్ళు మాటలు మాట్లాడుకుంటున్న అవి బూతుల్లానే ఉన్నాయి. హరి ఐతే ఆర్జీవీలా కాసేపు పుష్ప రాజ్ లా కాసేపు ట్రాన్సఫార్మ్ ఐపోయాడు. అష్షు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. "బేసిక్ గా నాకు దేవుడంటే కోపం ఇంత అందాన్ని ముందే ఎందుకు పరిచయం చేయలేదన్న కోపం" అంటూ హరి రామ్ గోపాల్ వర్మలా చెప్పిన డైలాగ్ అష్షు, హోస్ట్ తేజస్విని షాకయ్యారు. ప్రోమో ఫైనల్ లో ఐతే పుష్ప శ్రీవల్లి తగ్గేదెలా ఐతే అష్షు - హరి కూడా తగ్గేదెలా అంటూ అష్షు కళ్ళు పట్టుకుని మరీ డైలాగ్ చెప్పాడు. ఇక హోస్ట్ తేజు ఐతే "నువ్వు చిన్నప్పటి నుంచి రాజుని పెంచుకున్నావ్ మరి హరిని ఎందుకు పెంచుతున్నావ్" అని అడిగింది. "పెంచుకోకపోతే ఉంచుకోమంటారని" అని అష్షు డైలాగ్ వేసింది. "అష్షు పక్కనున్న చాలు ప్రేమించక్కర్లేదు" అన్నాడు హరి.
"ఏంటి నీకేమన్నా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తున్నారా ఇవన్నీ చెప్పమని..ఊపాల్సింది ఊపకుండా కాళ్ళు ఊపుతున్నాడు " అంటూ హరి పరువు తీసేసింది అష్షు. అప్పుడు హరి "ఈ టాస్కుల్లో గెలిస్తే హగ్గులు, ముద్దులు ఏమన్నా ఉన్నాయా" అని హోస్ట్ ని అడిగాడు. వెంటనే అష్షు రియాక్ట్ అయ్యి "ఇలాంటి వాళ్ళ వలనే అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి భయపడుతున్నారు" అంటూ పెద్ద కౌంటర్ వేసింది. ఇక అష్షు, హరి వాళ్ళ జీవితంలో జరిగిన ఎన్నో ఇన్సిడెంట్స్ ని ఈ షోలో చెప్పారు. ఇంతకు ఎం చెప్పారో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చూడాల్సిందే.