న్యూసెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ
మదనపల్లి గ్రామంలో ప్రెస్ క్లబ్ ని నడిపిస్తుంటాడు ఈశ్వర్. ఇందులో శివ(నవదీప్), ఇలియాజ్, నీల(బిందు మాధవి), ఇంకా కొంతమంది జర్నలిస్టులతో ఈ ప్రెస్ క్లబ్ ని రన్ చేస్తున్న ఈశ్వర్.. ఒకవైపు పోలీసులకి, మరోవైపు ఇద్దరు పొలిటీషన్స్ కి మధ్య రాయబారిగా మారుతాడు. అక్కడ జరుగుతున్న అక్రమాలను డబ్బులు తీసుకొని కప్పివేస్తుంటాడు శివ(నవదీప్). అయితే శివకి గిట్టనివాళ్ళున్నారు. ఒకరోజు రాత్రి శివ బైక్ పై వస్తుండగా కొందరు దుండగులు దాడి చేస్తే అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడతాడు. అసలు శివని చంపాలనుకుందెవరు? పొలిటీషన్స్ కి శివకి మధ్య ఒప్పందం ఏంటి? ఇందులో పోలీసుల పాత్ర ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే 'న్యూసెన్స్' వెబ్ సిరీస్ చూడాల్సిందే...