English | Telugu

'అన్ స్టాపబుల్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి

'పిల్లా నువ్వు లేని జీవితం', 'ఈడోరకం ఆడోరకం' వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్ర వేసుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ 'అన్ స్టాపబుల్'. 'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక. బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఏ2బీ ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'అన్ స్టాపబుల్' టీజర్‌, పాటలకు మంచి స్పందన లభించింది.

తాజాగా అన్ స్టాపబుల్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఖరారైంది. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఈ చిత్రం విడుదల తేదీని అనౌన్స్ చేశారు. జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. సప్తగిరి, విజే సన్నీ తో పాటు సినిమా తారాగణం అంతా వున్న అనౌన్స్ మెంట్ పోస్టర్.. ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్ టైనర్ అని భరోసా ఇస్తోంది.

బ్లాక్ బస్టర్ 'ధమాకా' కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. బిత్తిరి సత్తి, షకలక శంకర్, పృథ్వీ, డిజే టిల్లు మురళి, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, చమ్మక్ చంద్ర, గీతా సింగ్, రోహిణి, రూప లక్ష్మీ, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వేణు మురళీధర్, ఎడిటర్ గా ఉద్ధవ్ వ్యవహరిస్తున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.