'టక్కర్'తో సరికొత్తగా వస్తున్న సిద్ధార్థ్!
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'టక్కర్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.