English | Telugu

పెళ్లి కాకుండానే బేబీ బంప్‌తో ఇలియానా.. అసలు విషయం ఏమిటంటే..!

ఇలియానా అంటే గుర్తొచ్చేది పోకిరి, దేవదాస్ మూవీస్. ఆ మూవీస్ లో ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. కుర్రాళ్ళ గుండెల్లో ఇలియానా నిలువెత్తు ఆటం బాంబు అప్పట్లో..అలాంటి ఇలియానా ఇప్పుడు మాతృత్వపు మధురిమలను ఎంజాయ్ చేస్తోంది. బ్లాక్ టాప్ లో రిలీజ్ చేసిన తన బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాను షాక్ చేస్తున్నాయి. హాట్ కేక్స్ లా తన ఫొటోస్ ని షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి "బంప్ అలర్ట్" అని కాప్షన్ పెట్టుకుంది. ఈ విషయం గురించి లాస్ట్ మంత్ లో చిన్న హింట్ కూడా ఇచ్చింది. "మమా" అనే లాకెట్ ఫోటోని అలాగే "అండ్ సో ది అడ్వెంచర్ బిగిన్స్..నీ కోసమే ఎదురుచూస్తున్న నా చిన్ని డార్లింగ్" అనే కాప్షన్ ఉన్న టీషర్ట్ ని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇలా బేబీ బంప్ ని చూపించేసింది. ఈ పిక్ ని చూసేసరికి మధుషాలిని, తమన్నా ఇద్దరూ హార్ట్ ఎమోజిస్ పోస్ట్ చేశారు. ఇలియానా తల్లవడమేమో కానీ నెటిజన్స్ మధ్య మాత్రం మెసేజెస్ వార్ జరుగుతోంది.

ఒక నెటిజన్ "లైంలైట్ లో ఉండడం కోసమే ఆమె ఇదంతా చేస్తోంది. బిడ్డను కనడంలో తప్పేమీ లేదు, కానీ అభిమానుల్ని సందిగ్ధంలో పడేయొద్దు. మీరొక బాధ్యత కలిగిన సెలబ్రిటీ...ఇలాంటి విషయాలు పోస్ట్ చేసేముందు మీ నైతిక బాధ్యతను మర్చిపోవద్దు" అని పోస్ట్ చేస్తే ఇంకో నెటిజన్ "ఇలియానాకి బేబీ ఉందా...? సరోగసీ ద్వారా బేబీని పొందినట్లైతే ఏజెన్సిస్ ఈ విషయాన్నీ వెల్లడించలేదు" అని పోస్ట్ చేశారు. ఇక జమున హరిహరన్ అనే పర్సన్ మాత్రం " ఆమె జీవితం, ఆమె శరీరం, ఆమె బిడ్డ .. ఇది 2023 . పిచ్చి వ్యాఖ్యలు చేయడం ఆపండి. ఆమెకు శుభాకాంక్షలు చెప్పండి. పుట్టబోయే బిడ్డకు అందమైన తల్లి ఉంది అని సంతోషించండి" అని కామెంట్ చేసింది. "సరే బేబీ పుట్టాక తండ్రి ఎవరు అని అడిగినప్పుడు ఆ బేబీ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా" అని మరో నెటిజన్ అనడంతో "అది ప్రమోషన్ మాత్రమే" అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఇలా ఆమె గురించి పాజిటివ్, నెగటివ్ కామెంట్స్ తో ఫాన్స్, నెటిజన్స్ ఫైట్ చేసుకుంటున్నారు. "మరి ఇది నిజామా...ఏదైనా ప్రొమోషన్స్ లో భాగమా మీరే తెలుసుకోండి " అనే ఒక టాస్క్ ని తన ఫాన్స్ ముందు పెట్టి ఆమె మాత్రం తన స్టయిల్లో లైఫ్ ని, తన బేబీ బంప్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ‘పోకిరి’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. స్టార్ హీరోలతో నటించి ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీస్ చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఇలియానా.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.