English | Telugu

బిగ్ షాక్‌.. 'బిగ్‌బాస్-13' విన్నర్, 'చిన్నారి పెళ్లికూతురు' హీరో మృతి!

ప్రముఖ బాలీవుడ్-టీవీ యాక్టర్, హిందీ 'బిగ్ బాస్' పదమూడో సీజన్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా మృతి చెందారు. ఆయన వయసు 40 సంవత్సరాలు. గురువారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికి మృతి చెందినట్టు కూపర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ్ శుక్లాకు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

'బాలికా వధు' సీరియల్ సిద్ధార్థ్ శుక్లాకు ప్రేక్షకుల్లో విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత అతను 'బిగ్ బాస్ - 13' విన్నర్ గా నిలిచారు. ఇటీవల 'బిగ్ బాస్' ఓటీటీలోనూ కనిపించాడు. 'హంప్టీ శర్మ కె దుల్హనియా'లో సపోర్టింగ్ రోల్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కు సిద్ధార్థ్ పరిచయమయ్యాడు. ఏక్తా కపూర్ నిర్మించిన 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్'లో అగస్త్య పాత్రలో నటించాడు. రియాలిటీ షోల్లో కూడా కనిపించాడు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఉంది.

సిద్ధార్థ్ ఆక‌స్మిక మృతికి దేశంలోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీ అంతా ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌యింది. ప‌లువురు సెల‌బ్రిటీలు ఈ వార్త నిజం కాక‌పోతే బాగుండునంటూ సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ వార్త‌ను త‌ట్టుకోలేక‌పోతున్నామ‌ని సంతాపం వ్యక్తం చేశారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.