English | Telugu

Rajpal yadav: లొంగిపోయిన అగ్ర కమెడియన్.. తీహార్ జైలుకి తరలింపు

-రాజ్ పాల్ యాదవ్ చేసిన నేరం ఏంటి!
-ఎందుకు తీహార్ జైలులో లొంగిపోయాడు
-అసలు కేసు ఏంటి!
-ఎప్పటినుచి నడుస్తుంది

అభిమానులు, మూవీ లవర్స్ తరచు తమ నోటి నుంచి హీరోలు చెప్పిన డైలాగ్స్ నే కాదు. కమెడియన్ చెప్పిన డైలాగ్స్ ని హమ్ చేస్తుంటారు. కాకపోతే ఏ కొంత మంది కమెడియన్స్ కో ఆ అదృష్టం దక్కుతుంది. అలాంటి అదృష్టాన్ని దక్కించుకున్న స్టార్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్. తన నోటి నుంచి వచ్చిన ఎన్నో డైలాగులు ఇండియన్ సినిమా మూవీ లవర్స్ ని ఉర్రుతలూగించాయి. అలాంటి రాజ్ పాల్ యాదవ్ ఇప్పుడు తీహార్ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు దారి తీసిన కారణాలని చూద్దాం.

మురళి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దగ్గర రాజ్ పాల్ యాదవ్, అయన సతీమణి కొంత డబ్బు అప్పు తీసుకున్నారు. తీసుకున్న డబ్బులకి చెక్కులు ఇచ్చారు. కానీ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో మురళి ప్రాజెక్ట్స్ ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్ట్ ని ఆశ్రయించగా సదరు కోర్ట్ రాజ్ పాల్ దంపతులని దోషులుగా తేల్చి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసు ని సవాలు చేస్తూ రాజ్ పాల్ ఢిల్లీ హైకోర్టు ని సంప్రదిస్తే రాజ్ పాల్ డబ్బు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో ఇరువురు రాజీపడాలని సూచించింది. కానీ రాజ్ పాల్ మాత్రం డబ్బు చెల్లించలేదు. ఈ కేసులోనే రీసెంట్ గా ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం రాజ్ పాల్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయాడు.2018 వ సంవత్సరం నుంచి సదరు కేసు నడుస్తూ ఉండటం గమనార్హం.


Also read:sri chidambaram garu: శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ

1999 లో సినీ రంగ ప్రవేశం చేసిన రాజ్ పాల్ ఇప్పటి వరకు సుమారు 120 సినిమాల వరకు చేసాడు. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో భూత్ బంగ్లా, వెల్ కమ్ టూ ది జంగిల్ వంటి చిత్రాలు ఉన్నాయి. రచయితగా, దర్శకుడు గా కూడా తన సత్తా చాటాడు. రవితేజ, సురేందర్ రెడ్డి, కళ్యాణ్ రామ్ ల కిక్ పార్ట్ 2 లో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో కిక్ ని ఇచ్చాడు.



Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.