English | Telugu
యాక్సిడెంట్ కి గురైన అక్షయ కుమార్.. చేసింది ఇతనే
Updated : Jan 20, 2026
-అర్ధరాత్రి ముంబైలో ఏం జరిగింది
-అక్షయ్, ట్వింకిల్ ఎక్కడ నుంచి వస్తున్నారు
-యాక్సిడెంట్ చేసింది ఎవరు
భారతీయ సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు అక్షయ్ కుమార్(Akshay kumar). ఈ ఏడాది 'బూత్ బంగ్లా , వెల్ కమ్ టూ ది జంగిల్, హైవాన్ వంటి భారీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి. గత ఏడాది పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప' లో శివుడిగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. నిన్న అర్ధరాత్రి అక్షయ్ కుమార్ కారు ప్రమాదానికి గురైన సంఘటన అందర్నీ ఉలిక్కిపాటుకి గురి చేసింది. పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
అక్షయ్ కుమార్ ఆయన సతీమణి మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna)తమ ఇరవై ఐదవ పెళ్లి వార్షికోత్సవ వేడుకల్ని విదేశాల్లో ఘనంగా జరుపుకున్నారు, అనంతరం నిన్న నైట్ ముంబై ఎయిర్ పోర్ట్ కి చేరుకొని కారులో ముంబై(Mumbai)లోని జుహు ప్రాంతంలో ఉన్న తమ నివాసానికి బయలు దేరారు. వెనక ఎస్కార్ట్ కారు కూడా ఫాలో అవుతుంది. ఈ వాహనాలకి కొంచం దూరంలో వేగంగా వచ్చిన మెర్సిడెస్ కారు ఒక ఆటోని ఢీకొట్టింది. దీంతో సదరు ఆటో అదుపు తప్పి అక్షయ్ కాన్వాయ్ పైకి రావడంతో అక్షయ్ కారు, కాన్వాయ్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ సంఘటనలో కాన్వాయిలో ఉన్న ఒక కారు బోల్తా కూడా పడింది.
Also read:23 ఆత్మహత్యలని ఆపిన సినిమా.. గ్రేట్ కదా
అదృష్టవశాత్తూ ప్రమాదంలో అక్షయ్, ట్వింకిల్ తో సహా ఎవరకి ఎటువంటి గాయాలు కాలేదు. కానీ ఆటో పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన ఆటో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా వాహనం నడిపినందుకు జుహు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతుంది. ఇక ఘటనకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.