English | Telugu
కళ్యాణ్‌రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది?
Updated : Nov 25, 2023
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డెవిల్’. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మించారు. మొదట ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకుడు కాగా, సినిమా పూర్తయిన తర్వాత కొన్ని కారణాల వల్ల దర్శకుడు నవీన్ మేడారం ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి దర్శకనిర్మాత అభిషేక్ నామా. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నందమూరి కళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది.
ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఫైనల్‌గా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చెయ్యాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 29న సినిమాను రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఇది అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.