English | Telugu
హీరోగా మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది!
Updated : Nov 25, 2023
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది వారసులు హీరోలుగా పరిచయమై తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సూర్య ఎంట్రీకి సంబంధించిన సన్నాహాలు పూర్తయినట్టు తెలుస్తోంది. ఆ సినిమా పేరు ‘ఫీనిక్స్’. ఈ సినిమా తమిళ్‌లో తెరకెక్కనుంది. ఎన్నో సినిమాలో తన యాక్షన్ సీక్వెన్స్‌లతో థ్రిల్ చేసిన యాక్షన్ డైరెక్టర్ అనల్ అరసు ఈ చిత్రానికి దర్శకుడు. సూర్య ఛైల్డ్ ఆర్టిస్టుగా ‘నానుమ్ రౌడీ ధాన్’, ’సింధుబాద్’ చిత్రాల్లో విజయ్ సేతుపతితో కలిసి నటించాడు.
విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన ‘జవాన్’ చిత్రానికి సంబంధించి జరుగుతున్న షూటింగ్‌కు సూర్య వచ్చాడు. అతన్ని చూసిన అనల్ అరసు తన సినిమాలో హీరోగా ఎంపిక చేసుకున్నాడు. ‘ఫీనిక్స్’ అనే సినిమా పూర్తిగా యాక్షన్ జోనర్‌లో ఉంటుందని తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం సూర్య గత ఆరు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నాడు. దాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి షూటింగ్‌కి రెడీ అయిపోయాడు. ఎకె బ్రేవ్‌మన్ పిక్చర్స్ పతాకంపౖౖె రాజలక్ష్మి అరసకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.