English | Telugu
అఖండ 2 ఓటిటి డేట్ ఇదేనా!.. నెట్ ఫ్లిక్స్ ఏం చెప్తుంది
Updated : Jan 3, 2026
-ఓటిటి డేట్ ఇదే
-నెట్ ఫ్లిక్స్ ఏం చెప్తుంది
-ఎన్నో అదనపు ఆకర్షణలు
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)లో దాగి ఉన్న నట విశ్వరూపం యొక్క రేంజ్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసిన చిత్రం 'అఖండ 2'(AKhanda 2).పైగా ఆ నట విశ్వరూపానికి శివతత్వం కూడా యాడ్ కా వడంతో థియేటర్స్ అన్ని జై బాలయ్య, హరహరమహాదేవశంభోశంకర అంటు మారు మోగిపోయాయి. కొంత మంది ఆడవాళ్లకి అయితే థియేటర్స్ లో పూనకాలు కూడా వచ్చాయి. దీన్ని బట్టి అఖండ 2 ప్రభావం అభిమానుల్లో,ప్రేక్షకుల్లో ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అఖండ 2 ఓటిటి స్ట్రీమింగ్ హక్కులని నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. సినీ సర్కిల్స్ లో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సదరు సంస్థ జనవరి 9 నుంచి అఖండ 2 ని ఓటిటి లవర్స్ కోసం అందుబాటులోకి తీసుకొస్తునట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ డేట్ పై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.పైగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారడంతో సినీ ట్రేడ్ వర్గాలు స్పందిస్తు కంటెంట్ కి ఉన్న కెపాసిటీ దృష్ట్యా అఖండ 2 ఓటిటి లో పాన్ ఇండియా వ్యాప్తంగా రికార్డు వ్యూస్ ని రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.
Also read:వృషభ ఎండింగ్ కలెక్షన్స్ ఇవేనా! ఫస్ట్ వీక్ ఎంత
సింహ, లెజండ్, అఖండ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలకృష్ణ, బోయపాటి కాంబో ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి, శాశ్వత ఛటర్జీ, కబీర్ దుహన్ సింగ్ తమ తమ క్యారక్టర్ లో అద్భుతంగా చేశారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో అదనపు హైలెట్. మరి జనవరి 9 ఓటిటి లో అడుగుపెట్టడం ఖాయమైతే ఓటిటి సినీ ప్రేమికుల్లో ఈ సంక్రాంతి మరింత సంతోషాన్ని నింపనుంది.