English | Telugu
సంక్రాంతికి గెలిచేది ఈ చిత్రమే.. పేరు ఇదే
Updated : Jan 2, 2026
-సంక్రాంతి విన్నర్ ఎవరు!
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-విజేత ఎవరో ఫిక్స్ అయిపోయిందా!
-యాంటీ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఏంటి
సంక్రాంతికి పర్యాయ పదం తెలుగు సినిమా అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వర్డ్ ని మారుద్దామని చూసినా మార్చలేని పరిస్థితి. అసలు సంక్రాంతి కోసం తెలుగు సినిమా, తెలుగు సినిమా కోసం సంక్రాంతి, ఇలా ఒకరికోసం ఒకరు పుట్టారా అని కూడా అనిపిస్తుంది. అంతలా ప్రతి సంక్రాంతికి పందెం కోళ్ళల్లా తెలుగు సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై టేక్ ఆఫ్ అవుతాయి. ఈ సారి కూడా ఆ ఆనవాయితీకి బ్రేక్ ఇవ్వకుండా సంక్రాంతికి మరింత శోభ ని తెచ్చేలా మెస్మరైజ్ చేసే చిత్రాలు ఐ ఫీస్ట్ అనుభూతిని కలిగించనున్నాయి.
ప్రభాస్, మారుతిల రాజా సాబ్, చిరంజీవి, వెంకటేష్,అనిల్ రావిపూడి మన శంకర వర ప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)రవితేజ నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bharha Mahasayulaku Vijnpathi)శర్వానంద్ ది నారి నారి నడుమ మురారి(Naari naari Naduma Murari)నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు(Anaganaga Oka raju)ఇలా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ వరుసగా ల్యాండ్ అవుతున్నాయి. ఈ మేరకు అన్ని చిత్రాల నుంచి రిలీజ్ డేట్ అధికారంగా రావడంతో పాటు మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక స్వతంత్ర సినీ ప్రపంచంలో దురాభిమానులు కూడా ఉంటారనే విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వేదికగా దురాభిమానులు రంగంలోకి దిగారు. మా హీరో సినిమా బాగా ఆడుతుందంటే మా హీరో సినిమా బాగా ఆడుతుంది. పలానా హీరో సినిమా ఆల్రెడీ ప్లాప్ అంటా ఇలా తమకి ఇష్టమొచ్చిన రీతిలో ద్వేష పూరితమైన వాతావరణాన్ని సోషల్ మీడియా వేదికగా సృష్టిస్తున్నారు.
Also Read:జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్
కానీ నిజమైన ఫ్యాన్స్ , మూవీ లవర్స్, తెలుగు సినిమా ప్రేక్షకులు, పరిశ్రమ మంచి కోరే వాళ్ళు మాత్రం సంక్రాంతి సినిమాలపై స్పందిస్తు 'ఈ సారి సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు డిఫరెంట్ జోనర్స్ తో వస్తున్నాయి. పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కడం జరిగింది. ఆయా చిత్రాల నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి. కాబట్టి అన్ని చిత్రాలు విజయాన్ని అందుకోవడం గ్యారంటీ. దీంతో తెలుగు సినిమా గెలిచినట్టే అనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఇళయ దళపతి విజయ్ మూవీ జన నాయకుడు కూడా విజయాన్ని అందుకోవాలని కూడా కోరుకుంటున్నారు.