English | Telugu
‘రాధికా..’ అంటూ టీజింగ్ మొదలు పెట్టిన సిద్ధు!
Updated : Nov 25, 2023
‘డిజె టిల్లు’.. టాలీవుడ్‌ని షేక్ చేసిన సినిమా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈ సినిమా యూత్‌ని, మాస్ ఆడియన్స్‌నే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ని సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాటలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది అనగానే అందరి దృష్టీ పాటలు ఎలా ఉండబోతున్నాయి అనేదానిపైనే ఉంది. ‘టిల్లు స్క్వేర్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయి మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు మరో పాట రాబోతోంది. నవంబర్ 27 సాయంత్రం 4.05 గంటలకు ‘రాధిక..’ అనే ఒక డాన్స్ నంబర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేస్తూ ఆ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. రామ్ మిర్యాల మ్యూజిక్ అందించడమే కాదు, అద్భుతంగా గానం చేశాడు. నిర్మాణ పరంగా ఆలస్యం జరుగుతున్నప్పటికీ మంచి కంటెంట్‌తో, పక్కా సూపర్‌హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో యూనిట్ వర్క్ చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.