English | Telugu
త్రిషకి మంగళసూత్రం ఇస్తానంటున్న అలీ!
Updated : Nov 24, 2023
కొన్ని రోజుల క్రితం నుంచి తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ప్రముఖ హీరోయిన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా సెగలు పుట్టించాయి. మన్సూర్ అలీ ఖాన్ త్రిష కి క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేసారు..ఈ టైంలో మళ్ళీ మన్సూర్ త్రిష గురించి తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
మన్సూర్ తాజాగా త్రిష కి క్షమాపణ చెప్పాడు. ఆయన మీడియా కి విడుదల చేసిన ఒక లేఖలో నా సహ నటి త్రిష, దయచేసి నన్ను క్షమించండి అలాగే మీ పెళ్లి త్వరలోనే జరగాలి మీ మెడలో మీ భర్త కట్టబోయే మంగళసూత్రాన్ని ఆశీర్వదించే అవకాశం ఆ దేవుడు నాకు కల్పించాలని మన్సూర్ అలీఖాన్ చెప్పడం జరిగింది.ఇటీవలే త్రిషకి క్షమాపణ అడిగే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన మన్సూర్ పై కొన్ని రోజుల నుంచి తమిళనాడు తో సహా పలు ఏరియాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల క్రితం కేసు విచారణ నిమిత్తం మన్సూర్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా మన్సూర్ అలీఖాన్‌పై పోలీసు చర్యలని కోరడంతో మన్సూర్ అలీఖాన్ ఇక చేసేది లేక త్రిషకి క్షమాపణలు చెప్పాడు.
కాగా మన్సూర్ తెలుగు సినిమా ప్రేక్షకులకి సుపరిచయమైన నటుడే.1991 లో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ సినిమాలోని ఆయన విలనిజాన్ని ఎవరు మర్చిపోలేరు. ఆ సినిమాలో గంధపు చెక్క స్మగ్లర్ గా ఆయన పండించిన సరికొత్త విలనిజాన్ని ఎవరు మర్చిపోరు .మూడు దశాబ్దాల పై నుంచి మన్సూర్ తన నటనతో ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగు ,తమిళ ,మలయాళ ,హిందీ భాషల్లో కలిపి సుమారు 250 సినిమాలకి పైగానే చేసాడు. లేటెస్ట్ గా విజయ్ లియోలో కూడా నటించాడు. ఆ మూవీకి సంబంధించిన సక్సెస్ మీటింగ్ లోనే మన్సూర్ త్రిష పై కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఇంట బయట విమర్శలని ఎదుర్కున్నాడు.