English | Telugu

ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్న కీర్తి సురేష్‌, రాధికా ఆప్టే!

కీర్తి సురేష్‌, రాధికా ఆప్టే.. ఈ ఇద్దరు హీరోయిన్లు తమ టాలెంట్‌ను ఎన్నో సినిమాల ద్వారా ప్రూవ్‌ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. కానీ, ఈ విషయాన్ని మాత్రం ఎంతో సీక్రెట్‌గా ఉంచుతున్నారు. కారణం తెలీదుగానీ, తాము చేస్తున్న ప్రాజెక్ట్‌ గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. ఎక్కడా చెప్పవద్దని యూనిట్‌ ఆర్డర్‌ వేసిందా? లేక ఇద్దరూ అనుకునే అలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

విషయం ఏమిటంటే.. భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో భారీ సినిమాలు, మరెన్నో వైవిధ్యమైన సినిమాలను నిర్మించిన సంస్థగా యష్‌రాజ్‌ ఫిలింస్‌కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇటీవలే ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి ‘టైగర్‌ 3’ రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించింది. సినిమాలే కాకుండా ఈ సంస్థ వెబ్‌ సిరీస్‌లను కూడా నిర్మిస్తూ ఓటీటీలో కూడా సంచలనం సృష్టిస్తోంది. ‘ది రైల్వే మ్యాన్‌’, ‘మండల మర్డర్స్‌’ వంటి వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ‘ది రైల్వే మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ను భోపాల్‌ గ్యాస్‌ ప్రమాదం నేపథ్యంలో రూపొందించారు. వరల్డ్‌ టాప్‌ టెన్‌ వెబ్‌ సిరీస్‌లలో ఈ వెబ్‌ సిరీస్‌ కూడా ఉండడం విశేషం.

తాజాగా ఓ పీరియాడిక్‌ థ్రిల్లర్‌ను నిర్మించేందుకు యష్‌రాజ్‌ ఫిలింస్‌ సన్నాహాలు చేస్తోంది. ‘అక్క’ పేరుతో రూపొందనున్న ఈ వెబ్‌ సిరీస్‌లో కీర్తి సురేష్‌, రాధికా ఆప్టే నటించనున్నారు. ధర్మరాజ్‌ శెట్టి అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ఆదిత్య చోప్రా నిర్మించే ఈ వెబ్‌సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్‌ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కీర్తి సురేష్‌, రాధికా ఆప్టే కూడా తాము చేయబోయే ఇతర ప్రాజెక్ట్స్‌ గురించి చెబుతున్నారు తప్ప ఈ వెబ్‌ సిరీస్‌పై పెదవి విప్పడం లేదు. మరి ఈ విషయంలో యష్‌రాజ్‌ ఫిలింస్‌ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో, అఫీషియల్‌గా ఈ ప్రాజెక్ట్‌ గురించి ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.