English | Telugu

అమ్మాయిలతో నిర్మాతను ట్రాప్‌ చేసిన దర్శకుడు అరెస్ట్‌!

సక్రమంగా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సక్రమంగా అంటే నీతి, నిజాయితీలతో డబ్బు సంపాదించడం. అలా చెయ్యాలంటే ఎంతో కృషి చేయాలి, మరెంతో శ్రమించాలి. అలాంటి శ్రమ తమ వల్ల కాదని భావించే కొందరు అక్రమంగా డబ్బు సంపాదించాలి, ఈజీగా లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా ఎదిగిపోవాలని కొందరు కలలు కంటూ ఉంటారు. దాని కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కేందుకు సిద్ధపడుతుంటారు. ఎలాంటి అక్రమాలకైనా పాల్పడేందుకు నడుం కడుతుంటారు. అలాంటి ఓ అక్రమార్కుడి భండారం బయట పడిరది. అతను కన్న కలలు కల్లలుగా కాగా, ఇప్పుడు ఆ వ్యక్తి కటకటాల వెనక్కి వెళ్ళాడు.

విషయంలోకి వెళితే.. ఒక నిర్మాతను అమ్మాయిల వలలో దించి అతని దగ్గర నుంచి డబ్బు దండుకోవాలని ప్రయత్నించాడు రవీంద్ర. కన్నడలో ‘బారబాత్‌’ అనే సినిమాను డైరెక్ట్‌ చేసిన రవీంద్ర ఈజీగా డబ్బు సంపాదించే మార్గం గురించి ఆలోచించి అమ్మాయిలను రంగంలోకి దించాడు. ఓ కన్నడ నిర్మాతను ఎంపిక చేసుకొని కొందరు అమ్మాయిలతో కలిసి పక్కాగా పథకం సిద్ధం చేశాడు. చింగారి, శ్రీకంఠ, శిశిర చిత్రాలను నిర్మించిన మహదేవ్‌ అనే నిర్మాత దగ్గరికి అమ్మాయిలను పంపి ఆయన్ని ట్రాప్‌ చేశాడు. అతను తమ దారిలోకి రాగానే తన అసలు రూపాన్ని బయట పెట్టాడు. సదరు నిర్మాతను డబ్బు కోసం వేధించడం మొదలు పెట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అమ్మాయిలతో లైంగిక వేధింపులకు పాల్పడ్డావని కేసు పెడతామని ఆ నిర్మాతను బెదిరించాడు. అతని ఆగడాలు మరీ శృతి మించడంతో నిర్మాత మహదేవ్‌ పోలీసులను ఆశ్రయించాడు. రవీంద్రపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి రవీంద్రను నిందితుడిగా తేల్చారు. అమ్మాయిలతో కలిసి డ్రామా క్రియేట్‌ చేసి నిర్మాతను వేధిస్తున్నాడని గుర్తించారు పోలీసులు. వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.