English | Telugu
'సలార్'ను డిస్ట్రిబ్యూటర్స్ పట్టించుకోవటం లేదా.. కారణమదేనా!
Updated : Aug 28, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వరుస పాన్ ఇండియా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో 'సలార్' సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కి సిద్ధమవుతోంది. కర్ణాటకలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన హోంబలే ఫిలింస్ ఈ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావస్తున్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సరే!.. మేకర్స్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో ఓ లెక్కకు రావటం లేదు. ముందు డిస్ట్రిబ్యూటర్స్ సలార్ రైట్స్ ను సొంతం చేసుకోవటానికి అంతగా ఆసక్తి చూపటం లేదు. అందుకు కారణం.. నిర్మాణ సంస్థ ఒక్కో ఏరియా కళ్లు తిరిగేలా రేట్స్ ను చెబుతుందట.
నైజాం ఏరియాకు రూ.70 కోట్లు చెప్పారు. ఓ స్టార్ ప్రొడ్యూసర్ అంత మొత్తంలో చెల్లించటానికి రెడీ అయ్యారు. అలాగే సీడెడ్ ఏరియాకు రూ.40 కోట్లు కోట్ చేశారు. అయితే మన డిస్ట్రిబ్యూటర్స్ అందుకు ఆసక్తి చూపలేదు. దాంతో మేకర్స్ చివరకు దాన్ని రూ.27 కోట్లకు ఇవ్వటానికి కూడా రెడీ అయ్యారు. కానీ అందుకు కూడా మనోళ్లు రెడీగా లేరట. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే కెజియఫ్ 2, కాంతారా చిత్రాలను రిలీజ్ చేసుకున్నట్లు సలార్ ను ఓన్ రిలీజ్ చేసుకోవటానికి హోంబలే ఫిలిమ్స్ రెడీ అవుతోందట.
కె.జి.యఫ్ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సినిమా. ప్రభాస్ నటిస్తోన్న పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ రేంజ్ కు చేరుకుంటాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. శ్రుతీ హాసన్ హీరోయిన్ గా నటించింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్ కి రాలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ సలార్ పైనే హోప్స్ పెట్టుకున్నారు.