English | Telugu

ఫ్యాన్స్ కి దళపతి విజయ్ షాక్..!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన అభిమానులకు అనుకోని షాకిచ్చారు. అసలు ఆయన ఇలాంటి పని చేస్తారని ఆయన ఫ్యాన్స్ అస్సలు ఊహించలేదు. అసలు వారు అంత కంగు తినేలా విజయ్ ఏం చేశారనే వివరాల్లోకి వెళితే.. ఈ తమిళ స్టార్ హీరో త్వరలోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారంటూ ఈ మధ్య వార్తలు వినిపించాయి. అయితే ఆలోపలే ఆయన తన నట వారసుడిగా కొడుకు జాసన్ సంజయ్ విజయ్ ను పరియం చేస్తారంటూ న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది. అప్పటికే ఆయన కొడుకు ఫిల్మ్ కోర్సు చేస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఫ్యాన్స్ జాసన్ సంజయ్ విజయ్ సినీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా? అని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ విజయ్ మాత్రం తన కొడుకుని హీరోగా పరిచయం చేయటం లేదు. ఆ విషయం అధికారికంగా కన్ ఫర్మ్ అయ్యింది. ఇది నిజంగా అభిమానులకు నిరాశను కలిగించే విషయమనే చెప్పాలి.

మరి జాసన్ విజయ్ ఏం చేయబోతున్నారో తెలుసా!.డైరెక్షన్. సినిమా కూడా ఫిక్స్ అయ్యింది. ప్రకటన కూడా వచ్చేసింది. కోలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ జాసన్ విజయ్ తో సినిమాను నిర్మించబోతున్నారు. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యింది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన ఎవరినీ తీసుకోవాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే దానికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. తమ అభిమాన హీరో కొడుకు హీరో అవుతాడనుకుంటే ఇలా డైరెక్టర్ కావటం అనేది ఆయన అభిమానులు డీలా పడే విషయమనే చెప్పాలి.

జాసన్ సంజయ్ విజయ్ టోరంటో ఫిల్మ్ స్కూల్ నుంచి ప్రొడక్షన్ డిప్లొమా (2018 -2020)ను కంప్లీట్ చేశారు. అలాగే లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో (రెండేళ్లు ఫాస్ట్ ట్రాకింగ్ కోర్స్) బి.ఎ. హానర్స్ (2020-2022)ను కంప్లీట్ చేశారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.