English | Telugu
'ఖుషి' కాంట్రవర్సీ.. నాగచైతన్య రియాక్షన్!
Updated : Aug 28, 2023
విజయ్ దేరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్ 1న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ సమయంలో చిత్ర విచిత్రమైన కాంట్రవర్సీ ఈ సినిమాపై రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులో నాగ చైతన్య పేరు రావటం అనేది కొస మెరుపు. అసలు విషయమేమంటే.. రీసెంట్ గా నాగ చైతన్య ఓ సినిమా చూడటానికి మల్టీప్లెక్స్ కి వెళ్లారు. ఇంటర్వెల్ సమయంలో అందులో ఖుషి మూవీ ట్రైలర్ ను వేశారు. అయితే ఆ ట్రైలర్ ను చూడటం ఇష్టం లేకుండా చైతన్య థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి.
కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ తమకు తోచినట్లు థంబ్ నెయిల్స్ పెట్టుకున్నారు. అయితే రీసెంట్ గా ఈ కాంట్రవర్సీ వార్తలపై నాగచైతన్య స్పందించారు. అలాంటి వార్తలను ఆయన కొట్టిపారేశారు. తన దృష్టికి కొన్ని వెబ్ సైట్స్ రాసిన ఈ రూమర్స్ వచ్చాయని, ఆ వార్తలను తాను ఖండించినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో సదరు రూమర్స్ కు చెక్ పడ్డట్లు అయ్యింది. నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత సామ్ నటించిన మూడో సినిమాగా ఖుషి రిలీజ్ అవుతోంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఖుషి సినిమాను నిర్మిస్తోంది. మహానటి తర్వాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన చిత్రం. కొత్తగా పెళ్లైన భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్దలు ఆధారంగానే ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతుంది. మలయాళ చిత్రం హృదయం అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం సమంత అమెరికా మియోసైటిస్ కు చికిత్సను తీసుకుంటోంది.