English | Telugu
దండలు మార్చుకున్న శివ్-ప్రియాంక..ఆశీర్వదించిన నీతోనే డాన్స్ జడ్జెస్
Updated : Jun 16, 2023
"నీతోనే డాన్స్" డాన్స్ షో ఇలా గ్రాండ్ గా లాంచ్ అయ్యిందో లేదో అలా ఫస్ట్ ఎపిసోడ్ మంచి హాట్ హాట్ గా స్టార్ట్ అయ్యింది. "మూడ్స్ ఆఫ్ లవ్" అనే థీమ్ తో ఈ వారం ఈ షో రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇది ఎంతో కలర్ ఫుల్ ఉంది. ఐతే ఇందులో ఒక స్పెషల్ విషయం ఏమిటి అంటే శివ కుమార్, ప్రియాంక జైన ఇద్దరూ దండలు మార్చేసుకుని పెళ్లి చేసేసుకున్నారు. వాళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ తర్వాత పెళ్లి మ్యూజిక్ ఫుల్ సౌండ్ పెట్టండి అంటూ ప్రియాంక అడిగింది. ఆ మ్యూజిక్ రాగానే వెంటనే ఇద్దరూ దండలు మార్చేసుకున్నారు. దండలు మార్చుకునేటప్పుడు తరుణ్ మాస్టర్ "శతమానం భవతి " అంటూ మంత్రాలు చదివారు.
అలా వాళ్లిద్దరూ జడ్జెస్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. వాళ్ళు కూడా గులాబీ రేకుల్ని జల్లి ఆశీర్వదించారు..శివకుమార్, ప్రియాంక జైన్ ప్రేమ విషయం మనందరికీ తెలిసిందే. మౌనరాగం సీరియల్‌లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్‌గా శివ కుమార్ నటించి తెలుగు ఆడియన్స్ ని ఎంతో మెప్పించారు. వీళ్ళు రొమాంటిక్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండే ఫోటోలను ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు అలాగే ఇద్దరూ కలిసి ఒకే కార్లో తిరుగుతూ ఉంటారు. అలాగే శివకుమార్ కార్ కొన్నప్పుడు ప్రియాంక ఫామిలీని కూడా తీసుకెళ్లాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో షాపింగ్ లు అవీ చేస్తూ ఉంటారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య షోస్ లో కనిపించే ఎంతో మంది నటులు, కమెడియన్స్ రీల్స్ లో లవ్ చేసి రియల్ గా పెళ్లి చేసుకుని ఆడియన్స్ కి షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మాత్రం "నీతోనే డాన్స్" స్టేజి మీద దండలు మార్చేసుకుని పెళ్లయిపోయింది అన్నట్టుగా వ్యవహరించారు.