English | Telugu

Sivaji Controversy: ముదిరిన వివాదం.. శివాజీపై సినీ ప్రముఖుల ఫిర్యాదు!

దండోరా మూవీ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్ ల గురించి ప్రముఖ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిన్మయి, అనసూయ, మంచు మనోజ్ వంటి వారు శివాజీ కామెంట్స్ ని తప్పుబట్టారు. ఇక ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరేలా ఉంది. కొందరు సినీ ప్రముఖులు శివాజీపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA)కి ఫిర్యాదు చేశారు. (Shivaji Controversy)

తెలుగు సినీ పరిశ్రమలో పని చేస్తున్న వంద మందికి పైగా మహిళల తరపున మేము ఈ లేఖ రాస్తున్నామంటూ.. దర్శకురాలు నందిని రెడ్డి, నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్, నటి మంచు లక్ష్మి, ఝాన్సీ లక్ష్మి కలిసి.. 'మా'కి ఫిర్యాదు చేశారు. 'మా'లో సభ్యుడైన నటుడు శివాజీ.. 'దండోరా' మూవీ ప్రమోషన్స్ లో మహిళల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, శివాజీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. లేదంటే న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. తన కామెంట్స్ పై శివాజీ క్షమాపణలు చెబుతాడేమో చూడాలి.

Also Read: హీరోయిన్ల దుస్తులపై కామెంట్స్.. శివాజీపై మంచు మనోజ్ ఫైర్!