English | Telugu

జేమ్స్ కామెరూన్ కి సంబంధించిన అసలు నిజాలు ఇవే 


-ఏంటి ఆ నిజాలు
-గత చరిత్ర ఏం చెప్తుంది!
-ఎన్నో సంచలనాలు సృష్టించాడు
-అత్యంత ధనవంతుడు కూడా


ప్రపంచ సినీ పితామహుడు ఎవరంటే సినీ మేకర్స్, సినీ అభిమానుల నోటి నుంచి వచ్చే ఒకే ఒక మాట 'జేమ్స్ కామెరూన్'. ఈ విషయంలో మిగతా వాళ్ళకి డౌట్ ఉంటే రీసెంట్ గా వచ్చిన 'అవతార్ ఫైర్ అండ్ యాష్' తో పాటు అయన నుంచి వచ్చిన గత చిత్రాలే ఉదాహరణ. భూమ్మీద కాలుమోపిన ఒక అతీంద్రియ శక్తిలా వరల్డ్ సినిమా పాతిక సంవత్సరాల తర్వాత ఆలోచించేది కామెరూన్ పాతిక సంవత్సరాల క్రితమే అలోచించి సిల్వర్ స్క్రీన్ పై ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేసాడు. సరికొత్త స్క్రీన్ ప్లే ని,టెక్నలాజి ని పరిచయం చెయ్యడంతో పాటు కథ, కథనాల్లో వేగాన్ని పెంచిన ఘనత కూడా కామెరూన్ సొంతం.అందుకే ప్రపంచ సినీ పితామహుడిగా మారాడు.సోషల్ మీడియాలో తాజాగా కామెరూన్ ప్రారంభ జీవితానికి సంబంధించిన కొన్ని నిజాలు అభిమానులని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.


కామెరూన్ పదిహేడేళ్ల వయసులోనే కాలేజీ చదువుకి స్వస్తి చెప్పి పలు రకాల ఉద్యోగాలు చేసాడు.ఈ క్రమంలోనే ట్రక్ (లారీ)డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకుని సినీరంగంలోకి అడుగుపెట్టి రోజర్ కార్మాన్ న్యూ వరల్డ్ పిక్చర్స్ అనే సంస్థలో వారానికి 175 డాలర్లకి దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా చేరాడు. 1978 లో 12 నిమిషాల నిడివితో 20000 డాలర్స్ తో 'జీనో జెనిసస్' అనే సైన్స్ ఫిక్షన్ డ్రామా నేపథ్యంలో షార్ట్ ఫిలింని రూపొందించాడు. మన ఇండియన్ కరెన్సీ లో చెప్పుకోవాలంటే దగ్గర దగ్గర గా 18 లక్షల రూపాయిలు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకి 1981లో ‘పిరాన్హా 2: ది స్పానింగ్’ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసి మనస్పర్థలు రావడంతో మూవీ కంప్లీట్ కాకముందే దర్శకత్వబాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 1984లో 'ది టెర్మినేటర్' మూవీతో మళ్ళీ దర్శకుడిగా మారారు.

వరల్డ్ వైడ్ గా సదరు చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కామెరూన్ పేరు మారుమోగిపోయింది.ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసిన తర్వాత 1997లో టైటానిక్ మూవీతో ప్రపంచం మొత్తాన్ని మెస్మరైజ్ చేసాడు.తెలుగులో కూడా ఆ చిత్రం విడుదలై చాలా ఏరియాల్లో వంద రోజులు ఆడింది. ఆ తర్వాత 12 సంవత్సరాలకి అవతార్ ప్రపంచాన్ని సృష్టించాడు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దర్శకుడిగా కేవలం ఇంత వరకు పదకొండు చిత్రాలే వచ్చినా అవన్నీ వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై మరిచిపోలేని చిత్రాలుగా ఉండిపోయాయి.

also read: నన్ను క్షమించండి.. స్త్రీ అంటే ఒక మహా శక్తి


ప్రస్తుతం రిలీజైన అవతార్: ఫైర్ అండ్ యాష్ చిత్రం 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 3,000 కోట్లకి గా వసూలు చేసింది. సినిమా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో కూడా ఒకరు. నివేదికల ప్రకారం ఆయన ఆస్తులు 1.1 బిలియన్స్ . అవతార్ 4 2029 డిసెంబర్ 21 న రానుంది. మరి మూడు అవతార్ భాగాలని మించి నాలగవ భాగాన్ని అందించాలని కామెరూన్ ఇప్పట్నుంచే కసరత్తుల్లో ఉంటారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.