English | Telugu
నన్ను క్షమించండి.. స్త్రీ అంటే ఒక మహాశక్తి
Updated : Dec 23, 2025
-క్షమాపణ కోరిన శివాజీ
-ఏం చెప్పాడు
-వీడియో వైరల్
శివాజీ(Sivaji)నిన్న తన అప్ కమింగ్ మూవీ 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల వస్త్రధారణపై కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సదరు వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో పాటు పలువురు సినీ ప్రముఖులు, మహిళా సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ గా తన వ్యాఖ్యలపై శివాజీ వివరణ ఇస్తూ ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది.
సదరు వీడియోలో శివాజీ మాట్లాడుతు 'నేను అమ్మాయిలందరి గురించి ఆ విధంగా మాట్లాడలేదు. ఇటీవల కాలంలో హీరోయిన్లు పలు విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో నాలుగు మంచి మాటలు చెప్పాలనే తాపత్రయంలో ఆ విధంగా మాట్లాడాను. ఈ ప్రాసెస్ లో ఊరు భాషలో రెండు అన్ పార్లమెంటరీ వర్డ్స్ దొర్లాయి. ఆ విధంగా నేను మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ మాటలకి ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయి.
also Read: శివాజీ వ్యాఖ్యలపై నరేష్ స్పందన ఇదే
నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహా శక్తి ఒక అమ్మవారిలాగా అనుకుంటాను. ఈ రోజు మన సమాజంలో ఆడవాళ్ళని ఎంత తక్కువగా చూస్తున్నారో తెలిసిందే. మనం ధరించే బట్టల ద్వారా అటువంటి అవకాశం ఇవ్వకుడదనేదే నా ఇంటెన్షన్. నా మాటలు ఇండస్ట్రీలో ఆడవాళ్లకి, బయట మహిళల్ని బాధ పెడితే క్షమించండి అని సదరు వీడియోలో చెప్పాడు.