English | Telugu
శివాజీ వ్యాఖ్యలపై నరేష్ స్పందన ఇదే
Updated : Dec 23, 2025
నరేష్ ఏమంటున్నాడు
శివాజీ ఏమంటున్నాడు
నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న సినీ కళామతల్లి ముద్దుబిడ్డ 'నరేష్'(Naresh). ఏ క్యారక్టర్ ని పోషించినా సదరు క్యారక్టర్ లో ఒక 'ఎరా'ని సృషించుకోవడం నరేష్ నటనకి ఉన్న స్టైల్. రీసెంట్ గా శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సదరు వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో పాటు పలువురు సినీ సెలబ్రటీస్ స్పందిస్తు ఉన్నారు. నరేష్ కూడా శివాజీ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది.
మాట్లాడే స్వేచ్ఛ ఎంత హక్కో, తిరిగే స్వేచ్ఛ మరియు దుస్తులు ధరించే స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యమైన హక్కు. గ్లామర్ రంగంలో పని చేస్తూ, వివిధ వ్యక్తులు మరియు పరిస్థితులని ఎదుర్కొంటాము. అలాంటి సందర్భాల్లో ఇతరుల దుస్తుల ఎంపికలని , గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉంది. అసభ్యమైన లేదా అనుచితమైన పదాలను ఉపయోగించడం ద్వారా సహచరులను అపహాస్యం చేయడం, వారికి ఇబ్బంది కలిగించడం చేయకూడదు.
Also read: కలెక్షన్స్ లో మా వాటా మాకు ఇచ్చేయాలి.. పాకిస్థాన్ ప్రజల డిమాండ్
అలా చేయడం వల్ల మనమే మన ప్రతిష్ఠని దెబ్బతీసుకున్నట్లవుతుంది. అశ్లీలత ఏంటన్నది నిర్ణయించడానికి సెన్సార్ ఉంది, ప్రభుత్వం ఉంది. మన ప్రవర్తనలో మరింత సౌమ్యత, సంస్కారం చూపిద్దాం అని ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది.