English | Telugu
Mysaa Glimpse: గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'మైసా' గ్లింప్స్.. రౌడీ జనార్ధన వైఫ్ రప్పా రప్పా..!
Updated : Dec 24, 2025
ఇటీవల 'ది గర్ల్ ఫ్రెండ్'తో ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందన్న(Rashmika Mandanna).. త్వరలో 'మైసా' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తో అలరించడానికి సిద్ధమవుతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్ ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. (Mysaa First Glimpse)
నిమిషానికి పైగా నిడివి ఉన్న 'మైసా' గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇందులో రష్మిక నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తోంది. ఒంటినిండా నెత్తుటి గాయాలతో.. ఒక చేతికి సంకెళ్లు, మరో చేతిలో తుపాకీ పట్టుకొని.. అడవిలో చావుకి ఎదురుగా నిలబడిన వీరనారిలా రష్మిక కనిపించింది.
"నా బిడ్డ సచ్చిందన్నారు.. కానీ, మట్టే వణికిపోయింది.. నా బిడ్డ రక్తాన్ని దాసలేక" అంటూ మైసా రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తల్లి చెబుతున్నట్టుగా వాయిస్ ఓవర్ రావడం అదిరిపోయింది. వందలాది మంది ఆయుధాలతో తనని చంపడానికి వస్తున్నా.. మైసా ఒక్కతే వారిని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడటం హైలైట్ గా నిలిచింది. "సావే సచ్చిపోయింది నా బిడ్డకు సంపలేక" అంటూ గ్లింప్స్ ని ముగించడం కట్టిపడేసింది. ఇక చివరిలో అడవిలో ఆడపులిలా మైసా గర్జించడం ఆకట్టుకుంది.
Also Read: ఎన్టీఆర్ వర్సెస్ అల్లు అర్జున్.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్న త్రివిక్రమ్?
ప్రస్తుతం 'మైసా' గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు ఈ గ్లింప్స్ ని ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన' గ్లింప్స్ తో పోలుస్తున్నారు. అందులో కూడా విజయ్ నెత్తుటి మరకలతో ఒక్కడే ఎంతోమందికి ఎదురు నిలబడి పోరాడతాడు. అందుకే నెటిజెన్లు "రౌడీ జనార్ధన వైఫ్ మైసా" అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో పుష్ప సినిమాని గుర్తుచేస్తూ.. "శ్రీవల్లి రప్పా రప్పా" అని కామెంట్స్ పెడుతున్నారు.