English | Telugu

మెగా విక్టరీ మాస్ సాంగ్.. సంక్రాంతి వైబ్ ముందే వచ్చేసింది!

Publish Date:Dec 30, 2025

  మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), విక్టరీ వెంకటేష్(Venkatesh) కలిసి చిందేస్తే.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. 'మన శంకర వరప్రసాద్ గారు'తో ఆ అద్భుతాన్ని సాధ్యం చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా ఈ సినిమా నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ విడుదలైంది. (Mana Shankara Varaprasad Garu)   చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'మన శంకర వరప్రసాద్ గారు'లో వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల, శశిరేఖ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్ గా మెగా విక్టరీ మాస్ సాంగ్ వచ్చింది. (Mega Victory Mass Song)   చిరంజీవి, వెంకటేష్ లపై చిత్రీకరించిన పార్టీ సాంగ్ ఇది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందరూ కాలు కదిపేలా ఎనర్జిటిక్ గా ఉంది. "మార్నింగ్ గ్రీన్ టీ.. నైట్ అయితే నైన్టీ.. ఎవడైతే ఏంటి" అంటూ క్యాచీ లిరిక్స్ తో అందరూ పాడుకునేలా పాటను రాశారు కాసర్ల శ్యామ్. "ఏంది బాసు సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి..." వంటి లైన్స్ ఫ్యాన్స్ హమ్ చేసుకునేలా ఉన్నాయి. ఆ మ్యూజిక్, లిరిక్స్ కి తగ్గట్టుగా సింగర్స్ నాకాష్ అజిజ్, విశాల్ దద్లాని ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ గా ఆలపించారు.   ఇక లిరికల్ వీడియోలో చిరంజీవి, వెంకటేష్ కలిసి స్టెప్పులేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా సంక్రాంతికి వైబ్ కి తగ్గట్టుగా ఇద్దరూ పంచెకట్టుతో కనిపించడం అదిరిపోయింది. మెగా, విక్టరీ ఫ్యాన్స్ కి ఈ సాంగ్ బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.    

Mega Victory Mass Song: A Celebration of Legends

Publish Date:Dec 30, 2025

The long-awaited collaboration between Megastar Chiranjeevi and Victory Venkatesh has finally materialized, sending ripples of excitement through the Telugu film industry. Directed by the visionary Anil Ravipudi, the Mega Victory Mass Song serves as a high-octane tribute to two of cinema's most enduring icons.  This musical spectacle from Mana Shankara Vara Prasad Garu captures a rare synergy, blending the sophisticated grace of the Megastar with the infectious, vibrant energy that defines Venkatesh’s screen persona. Nakash Aziz and Vishal Dadlani have sung the song with lyrics written by Kasarla Shyam.  Composer Bheems Ceciroleo has crafted a rhythmic powerhouse that perfectly complements the legends' synchronized choreography. The track is not merely a song but a grand visual event, characterized by opulent production design and a dynamic set-up that amplifies its scale.  The meticulous attention to styling and the commanding screen presence of both actors ensure that every frame resonates with charisma. It is the kind of high-energy composition designed specifically for the big screen, where the collective roar of a packed theater becomes part of the soundtrack. Producer duo Sahu Garapati and Sushmita Konidela have spared no expense in ensuring the film meets the highest technical standards. As the release date of January 12, 2026, approaches, the anticipation for this unprecedented mass euphoria continues to mount.  Anil Ravipudi has successfully navigated the immense task of honoring their combined legacies while delivering a fresh, thrilling experience. Mana Shankara Vara Prasad Garu is poised to redefine box-office milestones, proving that when two titans unite, the impact is truly historic. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  

పారితోషికం విషయంలో మహానటి సావిత్రి అలా ఎందుకు చేశారో తెలుసా?

Publish Date:Dec 26, 2025

(డిసెంబర్‌ 26 మహానటి సావిత్రి వర్థంతి సందర్భంగా..) పాతతరం కథానాయికల్లో మహానటి సావిత్రి తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ మహానటిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు సావిత్రి. సౌమ్యురాలిగా, దానశీలిగా, ప్రేమమూర్తిగా పేరు తెచ్చుకున్న ఆమె  జీవితంలో ఎన్నో వెలుగు నీడలు ఉన్నాయి. తన మంచితనంతో ఎంత పేరు తెచ్చుకున్నారో, కొన్ని సందర్భాల్లో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. పాతాళభైరవి చిత్రంలో తొలిసారి ఒక డాన్సర్‌గా కనిపించిన సావిత్రి.. ఆ తర్వాత పెళ్లిచేసి చూడు, పల్లెటూరుతోపాటు కొన్ని తమిళ సినిమాల్లో మంచి పాత్రలు పోషించి నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చేసిన దేవదాసు చిత్రం ఆమె కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తరుణంలోనే పారితోషికానికి సంబంధించి ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై ఒక పత్రికలో 'నిర్మాతలకు హెచ్చరిక' పేరుతో ఒక ఆర్టికల్‌ కూడా వచ్చింది. దాని సారాంశం ఇది. నిన్న మొన్నటి వరకు సినిమాకు 300 తీసుకొని నటించిన సావిత్రి ఇప్పుడు ఏకంగా ఒక సినిమాకు 20,000 రూపాయలు డిమాండ్‌ చేస్తోందని, ఇది నిర్మాతల శ్రేయస్సుకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆ ఆర్టికల్‌లో ప్రస్తావించారు. అప్పటివరకు సావిత్రి నటించిన ఒక్క సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదని, అలాంటప్పుడు ఆమె అడిగినంత పారితోషికం ముట్టచెప్పి అనవసరంగా ఆమె వేల్యూని పెంచేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  పత్రికలో ఈ ఆర్టికల్‌ వచ్చేనాటికి చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత బాగాలేదు. మంచి కథని ఎంపిక చేసుకొని సినిమా విజయం సాధించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫలితం ఉండేది కాదు.  కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆరోజుల్లో పెద్ద నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న ఎవిఎం, జెమిని వంటి సంస్థలకు ఉద్యోగులను తగ్గించే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు చిత్ర పరిశ్రమ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  చిత్ర నిర్మాణ వ్యయం పెరిగిపోవడానికి ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు కూడా ఒక కారణమనే అభిప్రాయం ఆరోజుల్లోనే.. అంటే 60 ఏళ్ళ క్రితమే ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా సావిత్రిని టార్గెట్‌ చేశారు నిర్మాతలు. దాంతో ఆమెతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారంటూ పత్రికలు కథనాలు రాశాయి. సావిత్రి సినిమా రంగంలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, అవకాశాల కోసం ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగేవారో ఆమె పెదనాన్న చౌదరిగారు గుర్తు తెచ్చుకోవాలంటూ సూచించారు.  తారాపథంలో ఎదిగిన తర్వాత తాము ఇండిస్టీలోకి ఎలా అడుగు పెట్టాము, దాని కోసం ఎన్ని మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చింది అనే విషయాలను తారలు గుర్తు పెట్టుకోవాలి. అలా కాకుండా తాము ప్రస్తుతం ఉన్న స్థితి గురించి మాత్రమే ఆలోచించడం చిత్ర పరిశ్రమకు శ్రేయస్కరం కాదు. ఉన్నఫళంగా పారితోషికం పెంచేయడం అనేది ఎవ్వరికీ క్షేమదాయకం కాదు. చేసిన దానికి తగిన ప్రతిఫలం తీసుకుంటూ క్రమంగా ఎదగడం తారలకు ఎంతో అవసరం. అలా ముందుకెళితేనే నిర్మాతలు మరిన్ని సినిమాలు నిర్మించే అవకాశం ఉంటుంది అంటూ ఆ పత్రికలో వచ్చిన కథనం అప్పట్లో చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. అయితే ఇప్పటివరకు సావిత్రి తీసుకునే పారితోషికానికి సంబంధించి ఇలాంటి వివాదం ఒకటి ఉందని చాలా మందికి తెలియదు.

సల్మాన్ ఖాన్ మూవీపై చైనా ఆగ్రహం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సల్మాన్  డైలాగులు 

Publish Date:Dec 30, 2025

    -ఎందుకు అంత అక్కసు  -ఏముంది ఆ మూవీలో  -చైనా మీడియా ఏం చెప్తుంది -సల్మాన్ ఏం చెప్పాడు       సికిందర్ పరాజయంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని లక్ష్యంతో తన కట్ అవుట్ కి తగ్గ మూవీ' బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'(Battle of galwan)తో సల్మాన్ ఖాన్(Salman Khan)ముస్తాబు అవుతున్నాడు. చైనా, మన దేశానికి మధ్య గల్వాన్(Galwan)నది హద్దు విషయంలో 2020 జూన్ 16 న జరిగిన యుద్దాన్ని బేస్ చేసుకొని తెరకెక్కుతుంది. అప్పట్లో ఆ పోరాటంలో మన సైనికులు ఇరవై మంది వరకు చనిపోయారు. రీసెంట్ గా మొన్న 27 న జరిగిన సల్మాన్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' నుంచి టీజర్ రిలీజ్ చేసారు.సదరు టీజర్ లో సల్మాన్ నుంచి వచ్చిన చావుకి ఎందుకు భయపడతారు, అది అనివార్యం అనే డైలాగ్ తో పాటు మరిన్ని డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై తమ అక్కసుని ప్రదర్శిస్తుంది.       అంతర్జాతీయ సమాజాన్ని తప్పు దోవ పట్టించి చైనా పై వ్యతిరేకతని రెచ్చగొట్టేందుకు భారత్ చరిత్రని వక్రీకరిస్తుంది. గల్వాన్ లో ఘర్షణలకి భారత్ నే కారణం. భారత దళాలు అక్రమంగా చైనా భూభాగంలోకి చొరబడి దాడి చేసాయి.  బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రం జాతీయ వాదంతో కూడిన మెలోడ్రామా అని గ్లోబల్ టైమ్స్ లో  రాసుకొచ్చింది. చైనా సైనిక నిపుణుడు  సాంగ్ జాంగ్ పింగ్ కూడా మాట్లాడుతు 'చైనా సార్వభౌమ భూభాగాన్ని రక్షించుకోవాలనుకునే మా సైనికుల దృఢ సంకల్పాన్ని మా సైనికులు కోల్పోరు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది.       Also read:  కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే      గల్వాన్ నది చైనా పాలనలో ఉన్న వివాదాస్పద 'అక్సాయ్ చిన్' ప్రాంతం నుండి భారతదేశంలోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రవహిస్తుంది . ఇది కారకోరం శ్రేణికి తూర్పు వైపున ఉన్న సామ్‌జుంగ్లింగ్ యొక్క కారవాన్ క్యాంపింగ్ గ్రౌండ్ సమీపంలో ఉద్భవించి పశ్చిమాన ప్రవహించి ష్యోక్ నదిలో కలుస్తుంది . సంగమ స్థానం దౌలత్ బేగ్ ఓల్డీకి దక్షిణంగా 102 కి.మీ దూరంలో ఉంది. ష్యోక్ నది సింధు నదికి ఉపనది , గల్వాన్‌ను సింధు నది వ్యవస్థలో భాగం చేస్తుంది. ఈ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఎప్పట్నుంచో గొడవలు జరుగుతున్నాయి. ఇక బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ కి అపూర్వ లఖియా(Apoorva Lakhia)దర్శకత్వం వహిస్తుండగా సల్మాన్ ఖాన్ సొంతంగా నిర్మిస్తున్నాడు. చిత్రాంగద కధానాయిక.  

మా బుజ్జి బంగారం డిమోన్‌ అంటూ పవన్ కి ముద్దు పెట్టేసిన రీతూ!

Publish Date:Dec 30, 2025

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. బిబి 9 స్పెషల్ గా రాబోతోంది. ఈ షోకి సంజన, రీతూ, శ్రీజ, కళ్యాణ్ పడాల, డెమోన్ పవన్, ఇమ్మానుయేల్ వచ్చారు. "బిగ్ బాస్ ఫాన్స్ రెడీ ఐపోండి. మూడు నెలల్లో మీరు చూసిన ఎంటర్టైన్మెంట్ ని మా పరివారంలో రెండు గంటల్లో ఇవ్వబోతున్నాం" అంటూ శ్రీముఖి చెప్పింది.    "ఫస్ట్ ఏ కామనర్ ఐనా శ్రమ పడాల, కష్టపడాల అప్పుడే అవుతారు కళ్యాణ్ పడాల" అంటూ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ కి మంచి ఎలివేషన్ ఇచ్చాడు హరి. వెంటనే శ్రీజ "బాబులకు బాబు కళ్యాణ్ బాబు" అంటూ అరిచింది. ఇక ఇమ్మానుయేల్ ఐతే "బయట శ్రీజ చేసే హడావిడికి గెలిచింది శ్రీజానా కల్యాణ అన్న విషయాన్ని మర్చిపోయారంతా" అన్నాడు. చాలా రోజుల తర్వాత ఇమ్మానుయేల్ ని షోలో చూసేసరికి హగ్ చేసుకుంది శ్రీముఖి. "మా కమెడియన్స్ కి ఎందుకు కప్ ఇవ్వలేదు" అంటూ అవినాష్ కూడా ఒక డైలాగ్ వేసాడు.    "పవన్ ఒక కామనర్ గా అడుగు పెట్టావు తర్వాత టాప్ 3 కి వెళ్లి సూటుకేసు తెచ్చావు ఎలా అనిపిస్తోంది" అని శ్రీముఖి అడిగేసరికి అవినాష్ పవన్ లా గొంతు మార్చి "చాల హ్యాపీ అనిపిస్తోంది" అన్నాడు. "బిగ్ బాస్ హౌస్ లో నా బిగ్గెస్ట్ సపోర్ట్ ఐతే రీతూ" అంటూ డిమోన్‌ పవన్ చెప్పుకొచ్చాడు. దాంతో రీతూ తెగ సిగ్గు పడిపోయింది. "ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ది మోస్ట్ జెన్యూన్ మా బుజ్జి బంగారం డిమోన్‌" అంటూ స్టేజి మీద పవన్ బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. ఇక పవన్ ఐతే కళ్ళెగరేస్తూ అదో ఘనకారంలా ఫుల్ హ్యాపీ అయ్యాడు. ఇక ఇమ్మానుయేల్ అటు పవన్ , ఇటు కళ్యాణ్ మీద చేతులేసి చిరంజీవిలా "ఏవండీ మా తమ్ముళ్లు జెమ్స్ అండి జెమ్స్ " అంటూ ఫైనల్ డైలాగ్ చెప్పాడు.  

విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..!

Publish Date:Dec 29, 2025

  కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. విజయ్-రష్మిక నిశ్చితార్థం ఈ ఏడాది అక్టోబర్ లో జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పుడు తాజాగా వీరి పెళ్లి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.   విజయ్, రష్మిక వివాహం 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరగనుందట. ఈ విషయాన్ని విజయ్, రష్మిక త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఫ్యాన్స్ కి వారిచ్చే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదేనని అంటున్నారు.   Also Read: 'ది రాజా సాబ్' కొత్త ట్రైలర్.. మారుతి ఇలా చేస్తాడని ఊహించలేదు!   2018లో విడుదలైన గీత గోవిందం, 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలలో విజయ్, రష్మిక కలిసి నటించారు. గత కొన్నేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఇద్దరూ ఫెస్టివల్స్ కలిసి జరుపుకోవడం, సీక్రెట్ గా వెకేషన్స్ కి వెళ్ళడం వంటివి చేశారు. ఇక ఇటీవల అక్టోబర్ లో ఎంగేజ్ మెంట్ జరిగిందని, రానున్న ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని న్యూస్ వినిపిస్తోంది.  

Are Vijay and Rashmika planning wedding on this date?

Publish Date:Dec 29, 2025

Vijay Deverakonda and Rashmika Mandanna are said to be in love from the moment they have become close on the sets of Geetha Govindam. Their friendship grew further after she cancelled her engagement with Rakshit Shetty and their off-screen intimacy grew further.  They have always maintained that they are friends and become close family friends as well. Rashmika Mandanna, in recent times, started being more open about how she values Vijay's existence in her life and how she wishes him to make a huge comeback in his career as he is struggling with commercial hits.  He also wished her on every success of hers and even powered her recent film, The Girlfriend, by giving voice over for trailer. Now, the rumors have been rampant about the couple getting engaged in a private ceremony last year. The rumors have stated that both the families have agreed for their marriage and are preparing for marriage.  Today, the rumors have surfaced about the couple getting married at Udaipur Palace on 26th February 2026. The arrangements about this huge wedding are going on say the reports and both the actors' families are silent on these reports. Well, will they officially confirm or deny these reports, we have to wait and see.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969