English | Telugu

ధనరాజ్ కి బాషా బ్యాక్ గ్రౌండ్.. హీరో నిఖిల్ ధనరాజ్ స్టూడెంట్ అన్న విషయం తెల్సా?

బిగ్ బాస్ పూర్తయ్యాక బిబి జోడి అంటూ డాన్స్ షో ఒకటి ప్లాన్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. అలా ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 వచ్చింది. ఇందులో ధనరాజ్-భానుశ్రీ జోడీ మిగతా జోడీలకు గట్టి పోటీ ఇచ్చేదిలా కనిపిస్తోంది. ఐతే ధనరాజ్ ఒకప్పుడు డాన్సర్ అని, తాను ఆయన స్టూడెంట్ ని అనే విషయాన్నీ ఈ షోలో హీరో నిఖిల్ రివీల్ చేసాడు.

"హలో ధనరాజ్ బ్రదర్.. నేను మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పాలి. ఆయన ఒక డాన్సర్. 1995 -96 మధ్యలో అనుకుంటా నేను చిన్నపిల్లాడిని అప్పటికి ఆయన నాకు పరిచయం. ఒక స్టేజి మీద ఆయన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి మా పేరెంట్స్ డాన్స్ నేర్పించడానికి ఇంటికి రమ్మన్నారు. అలా ఒక ఆరు నెలలు మా ఇంటికి వచ్చి డాన్స్ నేర్పించారు. ఆరోజు రెండు పాటలకు నేర్పిన డాన్స్ ని నేను చాల స్టేజెస్ మీద చేసి ఎన్నో ప్రైజ్ లు గెలుచుకున్నాను. ఆల్ ది బెస్ట్" అంటూ చెప్పాడు.

"కంట్రీ క్లబ్ లో 1995 లో బూగీవూగి అంటూ డాన్స్ కాంపిటీషన్ పెడితే అందులో థర్డ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఒకావిడ వచ్చి బాగా డాన్స్ చేస్తున్నావ్ మా అబ్బాయికి నేర్పించవా ఎంత ఫీజు అని అడిగారు. 1200 చెప్పాను ఆవిడ 1500 ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ ఇల్లు బేగంపేట్.. నువ్వు ఫిలిం నగర్ నుంచి రావాలి కదా బస్సు పాస్ తీసుకోవడానికి అని చెప్పారు. నిఖిల్ వాళ్ళ బ్రదర్ ని డాన్స్ నేర్పించడానికి వెళ్లాను. ఆయన నాగబాబు గారి మూవీ కౌరవుడులో ఆయన కొడుకుగా చేసాడు. అలా ఆయనకు డాన్స్ నేర్పిస్తుంటే నిఖిల్ కూడా నేర్చుకున్నాడు. అలా జరిగింది ఈ జర్నీ. ఫస్ట్ టైం యువత అనే మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు నిఖిల్ నన్ను పిలిచాడు. అప్పటికి హ్యాపీడేస్ టాప్ హీరో నిఖిల్ గా తెలుసు. ఆయనే వచ్చి మీరు నన్ను గుర్తుపట్టలేదా అంటే అప్పుడు నేను డాన్స్ నేర్పించిన నిఖిల్ హీరో అయ్యాడన్న విషయం తెలిసి చాల ఆనందంగా అనిపించింది." అంటూ ధనరాజ్ కూడా చెప్పాడు.

"నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాను.. మా ఆవిడా కూడా అక్కడే పరిచయం అయ్యింది. నేను ముక్కు రాజు మాష్టర్ దగ్గర ఫ్రీ డాన్స్ క్లాసెస్ కి వెళ్ళేవాడిని. అక్కడ రాకేష్ మాష్టర్ "హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే అనే సాంగ్ చేస్తున్నప్పుడు డాన్స్ అంటే ఎలా ఉంటుందో నేర్చుకున్నాను. అక్కడ చేసాను" అని ధనరాజ్ చెప్పాడు. "టెలిఫోన్ ధ్వనిలా నవ్వెదన" అనే సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు నేను వచ్చాను. ఐతే నాకంటే సీనియర్ ఐతే నువ్వు" అన్నాడు శేఖర్ మాస్టర్.