English | Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన నిధి 

'ఇస్మార్ట్ శంకర్'తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన 'నిధి అగర్వాల్'(Nidhhi Agerwal), లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో కలిసి చేసిన 'హరిహర వీరమల్లు'(Harihara veeramallu)తో మరింతగా చేరువయ్యింది. 'పంచమి' అనే క్యారక్టర్ లో అత్యద్భుతంగా చేసిందనే కితాబుని కూడా అందుకున్న నిధి,రీసెంట్ గా ఏపి(Ap)లోని భీమవరం(Bhimavaram)లో  జరిగిన ఒక 'స్టోర్' కార్యమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి(Ap Government)చెందిన అధికార వాహనంలో సదరు కార్యక్రమానికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.

అదే సెంటిమెంట్ వర్కవుట్ అయితే పుష్పరాజ్ రికార్డ్స్‌ని రాజాసాబ్‌ గల్లంతు చేస్తాడా! 

బాహుబలి పార్ట్ 1 , పార్ట్ 2 ,సలార్, సాహో,ఆదిపురుష్, కల్కితో ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా స్టార్ గా నిలిచిన విషయం తెలిసిందే. కలెక్షన్స్ పరంగా ఆయా చిత్రాలతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఒక బెంచ్ మార్కుని కూడా సెట్ చేసాడు. దీంతో ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab)పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది. కొంత గ్యాప్ తర్వాత రాజాసాబ్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ లో  కనిపిస్తుండటం, ఫస్ట్ టైం హర్రర్ కామెడీ జోనర్ చేస్తుండటంతో, రాజాసాబ్ హిట్ అనే సంకేతాలు సినీ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది.