English | Telugu

ప్రభాస్ తో అభిషేక్ బచ్చన్ ఢీ!

పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)తన అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab)కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ 'కేరళ' లో పాటల చిత్రీకరణలో ఉందని, ఆ తర్వాత విదేశాల్లో మరికొన్ని పాటలని చిత్రీకరించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని కూడా 'ప్రభాస్' పారలాల్ గా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, కొన్ని షెడ్యూల్స్ ని కూడా జరుపుకుంది. పీరియాడిక్  అంశాలతో కూడిన మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.