English | Telugu

బాలీవుడ్‌ను భయపెడుతున్న ప్రభాస్‌.. పోటీ నుంచి తప్పుకుంటున్న స్టార్‌ హీరో!

ప్రభాస్‌, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజా సాబ్‌’ చిత్రాన్ని డిసెంబర్‌ 5న విడుదల చేయబోతున్నట్టు ఆల్రెడీ ఎనౌన్స్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ విడుదలై సినిమాపై భారీ అంచనాలను ఏర్పరిచింది. ప్రభాస్‌కి బాలీవుడ్‌ మార్కెట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రభాస్‌ చేసిన కొన్ని సినిమాలు తెలుగు కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ కలెక్ట్‌ చేశాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణవీర్‌సింగ్‌ తాజా సినిమా ‘దురంధర్‌’ చిత్రాన్ని కూడా డిసెంబర్‌ 5నే విడుదల చేయబోతున్నట్టు ఎనౌన్స్‌ చేశారు. ఒకేరోజు ఈ రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి. అయితే ‘రాజాసాబ్‌’ డిసెంబర్‌ 5న రిలీజ్‌ కాకపోవచ్చని, సంక్రాంతికి మారే అవకాశం ఉందనే వార్త కూడా ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టు తెలుగు రాష్ట్రాల బయ్యర్లు కూడా సంక్రాంతికి వస్తేనే బాగుంటుందని నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే సినిమాను వాయిదా వేశారా లేదా అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

డిసెంబర్‌ 5న విడుదల కాబోతున్న ‘దురంధర్‌’ సినిమాపై ‘రాజా సాబ్‌’ ప్రభావం పడే అవకాశం ఉందని బాలీవుడ్‌ ట్రేడ్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా స్టార్‌తో పోటీకి దిగితే ఓపెనింగ్స్‌ దెబ్బతింటాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. అందుకే డిసెంబర్‌ కంటే ముందుగా గానీ, ఆ తర్వాతగానీ ‘దురంధర్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తే బాగుంటుందని నిర్మాతలకు సూచిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి చేయాల్సిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా ఉంది. కాబట్టి ముందుగా రిలీజ్‌ చేసే అవకాశం లేదు. దురంధర్‌ సినిమా యానిమల్‌ తరహాలో వైలెంట్‌గా ఉంటుందట. అందుకే రిలీజ్‌ విషయంలో తొందరపడకుండా ఏం జరుగుతుందో చూద్దామన్న ధోరణిలో ఆ చిత్ర నిర్మాతలు ఉన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.