English | Telugu
ఇప్పుడు ఇండియన్ సినీ ప్రేమికులు ఒక న్యూస్ నిజమవ్వాలని కోరుకుంటున్నారు. కోరుకోవడమే కాదు తమ ఇష్ట దైవాలని కూడా ప్రార్థిస్తున్నారు. అంత గొప్ప వార్త ఏంటి అని అనుకుంటున్నారా! చెప్తే మీరు కూడా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. నమ్మడంలేదా..అయితే రెడీ అవ్వండి
మే 13న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే ఈ స్థానం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బరిలో నిలిచారు. నామినేషన్ ర్యాలీతోనే పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామనే సంకేతాన్ని ఇచ్చారు పవన్ . అయినప్పటికీ రిలాక్స్ అవకుండా, ప్రచారంలో జోరు చూపిస్తున్నారు. అంతేకాదు పవన్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగుతున్నారు.
ఓటీటీలోకి ప్రతీవారం కొత్త సినిమాలు రిలీజవుతుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే హిట్ గా నిలుస్తాయి. అయితే తమిళం, మలయాళంలో రిలీజైన కొన్ని సినిమాలు తెలుగులోకి అనుసరిస్తున్నారు మేకర్స్. దాదాపు ఆరు సంవత్సరాల క్రితం తమిళంలో రిలీజైన మూవీ ' అరువి'. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
'బాహుబలి-2' తరువాత వసూళ్ల పరంగా ఆ స్థాయిలో సంచలనాలు సృష్టించగల చిత్రమని అందరూ బలంగా నమ్ముతున్న సినిమా 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) అని చెప్పవచ్చు. మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమా ఎన్నికల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మేకర్స్.. ఈ మూవీకి అదిరిపోయే కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేశారని సమాచారం.
సమంత (samantha) కి సంచలనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక రకంగా వైఫై లా తన చుట్టు తిరుగుతుంది. ఒకప్పుడు తన సినిమాలు మాత్రమే మాట్లాడేవి. ఇప్పుడు పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుతున్నాయి.తను కూడా అందుకు తగ్గట్టే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాలకే మెజారిటీ సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఈ వారం రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ మూవీ 'టిల్లు స్క్వేర్'(Tillu Square) కాగా, మరొకటి ఫ్లాప్ గా నిలిచిన 'ఫ్యామిలీ స్టార్'(Family Star).
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా పరిచయమైన 'చిరుత' సినిమాతోనే నేహా శర్మ(Neha Sharma) కూడా హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. కానీ ఎందుకనో ఆమెకు తెలుగులో అంతగా ఆఫర్లు రాలేదు. 'చిరుత' తర్వాత తెలుగులో 'కుర్రాడు' సినిమా చేసిన ఆమె.. అనంతరం బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. హిందీలో పలు సినిమాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
నాకు ఎవరి దగ్గర్నుంచి డబ్బులు రాలేదు..నాకు నచ్చింది చెప్పాను.. ఇప్పుడు ఈ మాటలన్నీ రేణు దేశాయ్ చెప్తుంది. రేణు దేశాయ్ అంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్యనే కదా అని అనుకుంటున్నారా! టూ హండ్రెడ్ పర్సెంట్ తనే. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అండ్ పిక్ ని షేర్ చేసింది. అంతే నిమిషాల్లో వైరల్ గా మారాయి.
ఒక్క అవకాశం..ఒకే ఒక్క అవకాశం.. సినిమా ఇండస్ట్రీలో తరచు వినపడే మాట.ఎందుకంటే ఆ ఒక్క అవకాశం వస్తే తెలుగు సినిమాని ఏలవచ్చు. ఈ మాట హీరోకి, హీరోయిన్ కే కాదు.. నిర్మాతకి కూడా వర్తిస్తుంది. వాస్తవానికి ఆ విషయం మరుగున పడిపోయింది.
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికీ ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరని అడుగక.. సిరిసిరి మువ్వలోని ఈ సాంగ్ ప్రస్తుతం శృతి హాసన్ ( Shruti haasan)కి పర్ఫెక్ట్ గా సూటవ్వుతుంది. విశ్వ కథానాయకుడు కమల్ వారసురాలిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన శృతి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
ఆంధ్రప్రదేశ్ లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. ఏపీ అసెంబ్లీ బరిలో ముగ్గురు సినీ ప్రముఖులు నిలిచారు. అందులో ఇద్దరు హ్యాట్రిక్ విజయంపై కన్నేయగా, ఒకరు మాత్రం మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ముగ్గురు ఎవరో కాదు.. నందమూరి బాలకృష్ణ, ఆర్.కె. రోజా, పవన్ కళ్యాణ్.
అందం, అభినయం, చలాకీతనం, సినిమా అంటే ప్యాషన్, డెడికేషన్, కష్టపడే మనస్తత్వం, వీటన్నింటికీ అదృష్టం
సినిమా హీరోయిన్ అవ్వాలంటే అదృష్టం ఉండాలి. అందులోను సినిమా ఉన్నాలేకపోయినా ప్రేక్షకులు తన గురించే ఆలోచిస్తు ఉండాలంటే పెట్టి పుట్టాలి. అతి తక్కువ మంది హీరోయిన్లకే అంతటి సినీ వరం లభిస్తుంది. ఆ జాబితాలో చేరిన అందాల భామ మృణాల్ ఠాకూర్(mrunal thakur) టూ డే టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
'మిర్చి' వంటి సూపర్ హిట్ తో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ.. ఆ తర్వాత అదే జోరుని కొనసాగిస్తూ 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే దర్శకుడిగా ఆయనకు ఐదో సినిమా మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. అదే 2022 ఏప్రిల్ లో వచ్చిన 'ఆచార్య'.
కొన్ని లక్షల మంది అభిమానగణం ఇళయ దళపతి విజయ్ సొంతం.ఆయన చిటికేస్తే తమిళనాడు మొత్తం కదిలి వస్తుంది. అంతటి క్రేజ్ ని రాత్రికి రాత్రే సంపాదించలేదు. రెండున్నర దశాబ్దాల పై నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తు వస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ పైడ్ రెమ్యునరేషన్ తీసుకునే మొదటి ఐదుగురులో కూడా ఒకడు.