Read more!

English | Telugu

బిజెపి డబ్బులు ఇవ్వలేదు..ఫోటో కూడా రివీల్ చేసిన రేణు దేశాయ్

నాకు ఎవరి దగ్గర్నుంచి డబ్బులు రాలేదు..నాకు నచ్చింది చెప్పాను.. ఇప్పుడు ఈ మాటలన్నీ రేణు దేశాయ్ చెప్తుంది. రేణు దేశాయ్ అంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్యనే కదా అని అనుకుంటున్నారా!  టూ హండ్రెడ్ పర్సెంట్ తనే. రీసెంట్ గా  సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అండ్ పిక్ ని షేర్ చేసింది.  అంతే నిమిషాల్లో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం దేశం ఎన్నికల హడావిడిలో ఉంది. తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మాధవి లత పోటీ చేస్తుంది.ఆమె  ప్రత్యర్థి  అసదుద్దీన్ ఒవైసి. దీంతో మాధవి లత  తన ప్రచారంలో ఒవైసి ని దూషించడంతో పాటుగా కొన్ని వివాస్పద వ్యాఖ్యలు చేసుకుంటు వస్తుంది. ఇప్పుడు అవి సంచలనంగా  మారాయి.వాటిపై పాజిటివ్ గా నెగిటివ్ గా కామెంట్లు వస్తున్నాయి.ఈ టైం లో  రేణు దేశాయ్ ఆమెకి సపోర్ట్ గా నిలిచింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ ని చూసాను. ఈ మాట చెప్పడానికి నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. నాకు అనిపించింది మాత్రమే చెప్పానంటు పోస్ట్ చేసింది. పైగా మాధవి లత పిక్ ని  కూడా షేర్ చేసింది. ఇక మాధవి లత  విరించి గ్రూప్ ఆఫ్  హాస్పిటల్స్ కి చైర్మన్ గా ఉన్నారు. 

ఇక రేణు దేశాయ్ సినీ కెరీర్ ని  చూసుకుంటే ఆమె రీసెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిందని చెప్పవచ్చు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు లో సామజిక కార్యకర్తగా చేసి ప్రేక్షకాభిమానాన్ని పొందిది. మంచి క్యారక్టర్ లు వస్తే నటించడానికి సిద్ధమని చాలా సందర్భాల్లో చెప్పింది.  డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేసింది.